60 గజాల్లో ఇల్లు .. జాతీయ స్థాయిలో గుర్తింపు .. మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖ దంపతులు
విశాఖపట్నంకి చెందిన ఓ జంట నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే అవకాశం లభించింది. విశాఖ గాజువాక లోని ఉప్పర కాలనీకి చెందిన ఎస్ దుర్గ, అప్పన్న బాబు దంపతులు చేసిన పని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాగా, నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. అయితే . మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేలా వారు ఏం చేశారంటే .. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొద్దిపాటి స్థలంలోనే అన్ని వసతులతో చక్కని అందమైన ఇంటిని వారు నిర్మించుకున్నారు. వారు నిర్మించిన ఇల్లు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.
పదిమంది మెచ్చుకునేలా అతి తక్కువ ఖర్చులో, తక్కువ స్థలంలో , అన్ని వసతులతో, చూడచక్కని ఇంటి నిర్మాణం చేసిన వీరు ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించారు. వీరి గురించి అందరికీ తెలిసేలా చేయాలని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ దంపతులతో మాట్లాడనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రెండు లక్షల 50 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఇక ఆ డబ్బుతో కలిపి, మరి కొంత డబ్బును వెచ్చించి, కొద్దిపాటి స్థలంలో వారు గృహ నిర్మాణం చేశారు. అంతకుముందు ఇల్లు లేక నానా అవస్థలు పడ్డారు దుర్గ దంపతులు.
నిరుపేద కుటుంబం కావడంతో ఇల్లు కట్టుకోవాలనే సొంతింటి కల తీర్చుకోవడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం వారికి ఎంతగానో ఉపయోగపడింది. ఇక ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారుల నుండి దుర్గ కు సమాచారం అందించారు. తక్కువ స్థలంలో చక్కని ఇల్లు కట్టుకున్న దుర్గ కథ అందరికీ తెలియాలని ఉద్దేశంతో నేడు ఆమెను ప్రధానమంత్రి మోడీ తో మాట్లాడడానికి ఉత్తమ లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. కేవలం 60 గజాల స్థలంలోనే నిర్మించిన ఇంటికి ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ విభాగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల దుర్గ దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడడం మొదట నమ్మలేకపోయాని, తమ ఇంటికి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందని ప్రతి ఒక్కరు అడుగుతుంటే గర్వంగా ఉందని దుర్గ చెప్తున్నారు. ఇల్లు కట్టుకున్న ఆనందం ఒకపక్క, తమ ఇంటికి జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది అన్న సంతోషం మరోపక్క, ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా ఓ నిరుపేద కుటుంబం అయిన తమతో మాట్లాడటం ఇంకోపక్క వారి ఆనందానికి కారణం అవుతున్నాయి