నిర్భయ దోషులకు ఈ నెల 22న ఉరిశిక్షను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి కూడా. దీంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న వారికి ఈ నెల 22 ఉదయం ఉరి తీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసలు ఉరికి ముందు డమ్మీ ఉరి తీసేందుకు వీలుగా ట్రయల్స్ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఉరిశిక్ష అమలు చేసే నలుగురి బరువుకు సరిపోయే ఇసుక బస్తాల్ని డమ్మీ ఉరి వేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేశారు. గత నెలలో బక్సర్ జైలు నుంచి కొనుగోలు చేసిన కొత్త ఉరి తాళ్లతో.. ఇసుక తో నింపిన బస్తాలకు ఉరి వేసే కార్యక్రమాన్ని ఈ నెల 16న నిర్వహించనున్నారు. నిర్భయ దోషులైన పవన్ గుప్తా.. ముకేశ్ సింగ్.. అక్షయ్.. వినయ్ శర్మల బరువులకు తగినట్లుగా ఇసుక బస్తాల్ని సిద్ధం చేశారు. వీటికి మాక్ హ్యాంగింగ్ తీయాలని అధికారులు నిర్వహించారు.
ప్రస్తుతం తిహార్ జైల్లో వేర్వేరు జైలు గదుల్లో ఉన్న నిర్భయ దోషులను త్వరలో ఉరి తీసే జైలు నంబరు 3కు తరలిస్తారు. అక్కడ వారికి ఏక కాలంలో ఉరిశిక్ష ను అమలు చేస్తారు. జనవరి 22 ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో నలుగురు నిర్భయ దోషులకు చనిపోయే వరకూ ఉరి తీయాలని పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయనున్నారు. ఈ తీర్పు అమలు పక్కాగా సాగేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను తీహార్ జైలు అధికారులు చేస్తున్నారు.