ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) ఇప్పటికే 10 వేల మందిని పొట్టనబెట్టేసుకుంది. అంతేనా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటిదాకా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య ఏకంగా 2.55 లక్షలకు పైగా చేరింది. అయితే ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా ఓ రేంజిలోనే ఉందని చెప్పాలి. ఈ వైరస్ బారిన పడి కూడా ప్రాణాలు దక్కించుకున్న వారి సంఖ్య ఇప్పటిదాకా 90 వేల మార్కును దాటింది. మొత్తంగా అతి తక్కువ వ్యవధిలోనే విశ్వవ్యాప్తంగా ప్రబలిన ఈ వైరస్... ప్రపంచ దేశాలను వణికిస్తోందనే చెప్పాలి. అయినా ఈ వైరస్ ఏ మేర ప్రభావం చూపనుంది? ఈ వైరస్ లో ఎన్నెన్ని రకాలు ఉన్నాయి? ఏ రకం ప్రమాదకారి? అన్న వివరాలపై ఇప్పటిదాకా అంతగా అవగాహన లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
కోవిడ్- 19 ఎంట్రీ ఇచ్చిన చైనాలో ఈ వైరస్ పై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వైరస్ ను తాము పూర్తిగా అరికట్టగలిగామని చెబుతున్న చైనా... ఈ వైరస్ కు సంబంధించిన కొన్ని కీలక వివరాలను కూడా ప్రపంచానికి అందజేసింది. ఈ వివరాల ప్రకారం... ఈ వైరస్ లో ‘ఎస్’ అని ఒక రకం, ‘ఎల్’ అని మరో రకం వైరస్ లు ఉంటాయట. ఈ రెండు రకాలు కూడా కోవిడ్- 19కు సంబంధించిన వేర్వేరు దశలేనట. అయితే ఈ రెంటిలో ఏది ప్రమాదకారి అన్న విషయానికి వస్తే... ఎస్ కంటే కూడా ఎల్ రకం వైరస్ అత్యంత ప్రమాదకారిగా తెలుస్తోంది. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో మెజారిటీ వ్యక్తుల్లో ఎల్ రకం వైరసే అధికంగా కనిపిస్తోందట. అంటే... ఎల్ రకానికి చెందిన వైరస్ సోకిందంటే... సదరు రోగి చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదన్న మాట.
ఇక కోవిడ్- 19 ఏ మేర ప్రభావం చూపుతుందన్న విషయానికి వస్తే... ఏటా ప్రపంచంలో కొన్ని రకాల ఫ్లూ వైరస్ లు తమదైన శైలి ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా నమోదైన అన్ని ఫ్లూ వైరస్ ల కంటే కూడా కోవిడ్ -19 వైరస్ పదిరెట్ల మేర ప్రభావం చూపుతుందట. అంటే.. ఫ్లూ వైరస్ ల కారణంగా ఏటా ప్రపంచ దేశాల్లో 29 వేల నుంచి 65 వేల మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. ఈ లెక్కన ఈ ఫ్లూ వైరస్ ల కంటే పదిరెట్ల మేర ప్రభావం చూపే కోవిడ్- 19 హీనపక్షం 2.90 లక్షల మందిని పొట్టనపెట్టుకునే ప్రమాదం ఉందట. అయితే ప్రపంచ దేశాలన్నీ అంటమేల్కోవడంతో ఈ మేర మరణాలు చోటుచేసుకోకున్నా... అన్ని రకాల ఫ్లూ వైరస్ కంటే కూడా కోవిడ్- 19 మరింత ప్రమాదకారేనన్న మాట. అందుకే కాబోలు... అన్ని ప్రపంచ దేశాలు కోవిడ్- 19 పేరు వింటేనే హడలిపోతున్నాయి.