దేశంలో డిజిటల్ విప్లవం ఎలా వచ్చింది?

Update: 2020-10-18 23:30 GMT
భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు ప్రారంభమై పాతికేళ్లు అవుతోంది. ఈ 25 ఏళ్ల సంబరంలో భారత్ దేశంలో టెక్నాలజీలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. దేశంలో 2008లో ‘3జీ’ సేవల ప్రారంభంతో ‘స్మార్ట్ ఫోన్’ విప్లవం మొదలైంది.  ఆ తర్వాత వచ్చిన 4జీ దేశాన్ని డిజిటల్ మయం చేసింది. 2105లో కేంద్రం డిజిటల్ ఇండియా ప్రచారం ప్రారంభించడంతో ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దేశంలో డిజిటల్ విప్లవం ఒక విప్లవాత్మకంగా మారింది.

1995లో దేశంలో మొబైల్ సేవలు ప్రారంభమైనప్పుడు ధరలు విపరీతంగా ఉండేవి. ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ కోసమే ఏకంగా రూ.4900 చెల్లించాల్సి వచ్చేది. కాల్ ధర నిమిషానికి రూ.17 ఉండేది. ఔట్ గోయింగ్ కే కాదు.. ఇన్ కమింగ్ కాల్ కు కూడా ఇదే ధర.

ప్రస్తుతం మన దేశంలో మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య ఏకంగా 106 కోట్లు ఉండడం విశేషం.  ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 68.76 కోట్ల మంది ఉన్నారు.  దేశ జనాభాలో దాదాపు 78 శాతం మంది వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయి. గత ఏడాది జనవరితో పోల్చితే దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.50 కోట్లు (1.4శాతం) తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

అయితే ఈ ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈ ఏడాది సోషల్ మీడియా యూజర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లు (48శాతం) పెరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. సోషల్ మీడియా యూజర్ల సంఖ్య పెరగడం దేశంలో చైతన్యానికి నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు.

రిలయన్స్ జియో 2016లో మొదలైన తర్వాత మొబైల్ సేవల్లో మరింత వేగం పుంజుకుంది. గత ఏడాది నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించింది. 2000 నాటికి దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2 కోట్లు మాత్రమే ఉండేది. 2015కు 31.70 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం 62.7 కోట్లకు చేరుకుంది. 2025 నాటికి దేశంలో యాక్టివ్ యూజర్ల సంఖ్య ేకంగా 97.4 కోట్లను అధిగమిస్తుందని ఐఏఎంఐఐ అంచనావేస్తోంది.
Tags:    

Similar News