ఓటు బ్యాంకు ఎలా పెరిగింది?.. వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

Update: 2022-08-17 07:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. అధికార పార్టీ కీల‌క నాయ‌కులు.. ఒక‌రిద్ద‌రు స‌ల హాదారు.. కొన్నాళ్లుగా.. పార్టీ ఓటు బ్యాంకు భారీ ఎత్తున పెరిగింద‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ యంలో ఓటు బ్యాంకు 49.7 శాతంగా తేలింది.

ఈ  క్ర‌మంలోనే వైసీపీకి అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలు.. 22 ఎంపీ స్థానాలు ద‌క్కాయి. ఫ‌లితంగా.. పార్టీ ఏపీలో అతి పెద్ద పాల‌క ప‌క్షంగా అవ‌త‌రించింది. అయితే.. ఇప్పుడు.. వైసీపీ నాయ‌కులు త‌మ ఓటు బ్యాంకు ఏకంగా.. 57 నుంచి 58 శాతం వ‌ర‌కు పెరిగింద‌ని అం టున్నారు.

దీనిపై పెద్ద ఎత్తున లెక్క‌లు కూడా చెబుతున్నారు. పార్టీకి ప్ర‌జ‌ల్లో ఓటు బ్యాంకు పెరిగింద‌ని.. మ‌ద్ద‌తు కూడా పెరుగుతోంద‌ని.. వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. తిరుప‌తి ఉప ఎన్నిక‌, బ‌ద్వేలు, నెల్లూరు ఉప ఎన్నిక‌ల్లో వ‌చ్చిన విజ‌యాన్ని ఓటు బ్యాంకును నాయ‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి భారీ ల‌క్ష్యం విధించారు. మొత్తం 175 స్థానాల‌కు 175 సీట్లు ఎందుకు సాధించ‌లేమ‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

అదేస‌మ‌యంలో 25 ఎంపీ స్థానాల‌కు.. 25 చోట్లా విజ‌యం ద‌క్కించుకోవాల‌ని అంటున్నారు. ఆ దిశ‌గా నాయ‌కులు కృషి చేయాల‌ని కూడా చెబుతున్నారు. క‌ట్ చేస్తే.. పార్టీ అధినేత‌.. ఇత‌ర స‌ల‌హాదారులు చెబుతున్న మాట‌ల‌పై సొంత పార్టీ నాయ‌కుల్లోనే తర్జ‌న భ‌ర్జ‌న ఏర్ప‌డింది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మంలో ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

దీనిని అంచ‌నా వేస్తున్న వైసీపీ నాయ‌కులు.. గ్రాఫ్ పెర‌గ‌క‌పోగా.. డౌన్ అవుతోంద‌ని.. ప్ర‌తిప‌క్షం టీడీపీ.. మ‌రో వైపు జ‌న‌సేన వైపు ప్ర‌జ‌లు చూస్తున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని.. దీనిని బ‌ట్టి ఓటుబ్యాంకు రాజ‌కీయం.. కేవ‌లం త‌మ‌ను మ‌భ్య‌పెట్టేందుకేనా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి ఓటు బ్యాంకు పెరిగి ఉంటే.. జ‌గ‌న్ పట్లా.. వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్లా.. ఎందుకు ఇంత వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు.. ఓటు బ్యాంకు పెరిగింద‌నే.. ప్ర‌క‌ట‌న‌ల‌పై సొంత పార్టీలో నే విస్మ‌యం వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News