ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి నెలలో ఏ ముఖ్యమంత్రి ఎలాంటి ముద్రను వేయలేరు. వేయటం అంత సులువు కాదు. పాలన మీద పట్టు.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు.. మంత్రివర్గంతో పాటు.. పార్టీని.. ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. ఇందుకు మినహాయింపుగా జగన్ నెల రోజు పాలనను చెప్పాలి.
ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న అంశాల మీద క్లారిటీతో పాటు.. ఎన్నికల హామీల అమలు మీద తనకున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయటం అంత చిన్న విషయం కాదు. కానీ..ఆ విషయంలో తానేమిటో చెప్పకనే చెప్పేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పుస్తకాల సైజులో ఉండే ఎన్నికల హామీల్ని కేవలం పేజీలోకి కుదించి.. దానికి నవరత్నాలుగా నామకరణ చేసిన జగన్.. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణంలోనే కీలక నిర్ణయాల మీద సంతకాలు చేయటం ద్వారా మాట ఇవ్వటమే కాదు అమలు చేసే విషయంలోనూ తాను వెనక్కి తగ్గనన్న విషయాన్ని చెప్పేశారు.
రాజకీయ ప్రత్యర్థులకే కాదు.. సొంత పార్టీ నేతలకు సైతం అవినీతి పనులు చేస్తే.. మీ పని అంతే అన్న విషయాన్ని చెప్పేశారు. అంతేకాదు.. కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాల విషయంలో కటువుగా ఉంటానన్న విషయాన్ని చెబుతూ.. రూ.8 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు చెప్పే ప్రజావేదికను కూల్చేసేందుకు వెనుకాడలేదు. ప్రజాసొమ్ము వృధా చేస్తారన్న మాటను ఆయన పట్టించుకోలేదు. వాస్తవానికి ప్రజావేదికను కూల్చివేయటం ద్వారా రూ.8 కోట్లు వృధా అయినా.. తర్వాతి కాలంలో వందలాది కోట్లు విలువ చేసే పర్యావరణ హననాన్ని అడ్డుకున్నారని చెప్పక తప్పదు.
తొలి సంతకంతోనే ఫించన్ల పెంపు ఫైలుపై పెట్టిన జగన్.. మంత్రివర్గ కూర్పులో ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకొని ఆశ్చర్యానికి గురి చేశారు. అందరి అంచనాల్ని వమ్ము చేస్తూ.. బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేయటం ద్వారా సామాజిక సమతౌల్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెప్పాలి. వెనుకబడిన వర్గాల వారికి పదవుల్లో 50 శాతం కేటాయించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి చెక్ చెప్పేయటమే కాదు.. స్నేహహస్తం చాటిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చక్కటి సంబంధాల్ని నెరపటం ద్వారా ఉభయతారకంగా వ్యవహరించే ప్రయత్నానికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి.
ప్రభుత్వ పాఠశాలల్లోకి.. ప్రైవేటు పాఠశాల్లలోకి విద్యార్థులు పెద్ద ఎత్తున చేర్చేలా అమ్మ ఒడి కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన.. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారు. కౌలు రైతులకు కూడా లబ్థి కలిగేలా తాజా కార్యక్రమం ఉండటం గమనార్హం. తెలంగాణలో లేని రీతిలో ఏపీలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణలోని విపక్షాలు జగన్ ప్రస్తావన తెచ్చి కేసీఆర్ ను ఇరుకున పెట్టాలని ప్రశ్నించటం విశేషం.
గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించే బృహత్తర పథకానికి రూపకల్పన చేసిన జగన్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగే బృహత్తర ప్రాజెక్టుకు తెర తీశారని చెప్పాలి. అధికారుల ఎంపికలోనూ సమర్థులకు ప్రాధాన్యతను ఇచ్చిన జగన్.. పాలనా రథాన్ని పరుగులు తీయిస్తున్నారు. చేతిలో అధికారం ఉంటే పరుగులు పెట్టుకుంటూ వాలిపోయే ప్రతిపక్ష నేతల ఊరింపులకు టెంప్ట్ కాకుండా.. తాను నమ్మినసిద్ధాంతాన్ని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ ఫిరాయింపులకు ఏ మాత్రం అవకాశం లేదని..ఒకవేళ పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేయటానికి సిద్ధమైన వారిని మాత్రమే పార్టీలో చేర్చుకుంటామని తేల్చేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంతోనూ.. అందునా ప్రధాని మోడీ సున్నం పెట్టుకోవటానికి ఎవరూ సిద్ధంగా లేని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని అదే పనిగా ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని పదే పదే వివిధ వేదికల మీద ప్రస్తావించటం ద్వారా.. హోదా సాధనలో తనకున్న కమిట్ మెంట్ ఏమిటన్నది చెప్పేశారు. మోడీ ఏమనుకుంటారన్న దాని కంటే ఏపీ ప్రజలకు తానిచ్చిన హోదా హామీని అమలు చేసుకోవాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన తన మార్క్ ను ప్రదర్శించారు. స్పీకర్.. డిప్యూటీ స్పీకర్ల ఎంపికలోనూ చతురతనుప్రదర్శించిన జగన్.. స్వల్ప వ్యవధిలోనూ అన్ని రకాలుగా తన ముద్రను వేశారని చెప్పాలి. మంత్రులు.. అధికారపక్ష ఎమ్మెల్యేలతో పాటు.. కీలక అధికారులు సైతం తోక జాడిస్తే.. తిప్పలు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి.
గడిచిన నెలలో జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు చూస్తే..
- రబీ సీజన్ నుంచే వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు
- పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 పంపిణీకి సిద్ధం.
- రైతుల పంటల బీమా ప్రీమియం ప్రభుత్వ ఖజానా నుంచే పూర్తిగా చెల్లింపు
- పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి
- కౌలు రైతులకు గుర్తింపు కార్డులు
- వ్యవసాయ రంగ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు
- మనసున్న పాలకుడినని సీఎం వైఎస్ జగన్ తొలి సంతకంతోనే నిరూపించుకున్నారు
- సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు
- పింఛన్లను దశల వారీగా పెంచే పనిలో భాగంగా తొలి దశలో పింఛన్‌ను రూ.2,250కు పెంపు
- వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
- డయాలసిస్ చేయించుకునే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్ నునెలకు రూ.3,500 నుంచి రూ.10 వేలకు పెంపు
- ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. రాష్ట్రంలో 42 వేల మందికి లబ్ధి
- అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు రూ.11,500కు పెంపు.. రాష్ట్రంలో 55 వేల మందికి ప్రయోజనం
- పారిశుధ్య కార్మికుల జీతాలు ఏకంగా రూ.18 వేలకు పెంపు
- హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల జీతాలు సైతం పెంపు
ఇక గ్రామ స్వరాజ్యం
- ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీర్ ఏర్పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల మందికి ఉపాధి
- అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు. ప్రతి పంచాయితీలో 10 మంది నియామకం
- మొత్తం మీద రాష్ట్రంలో 13,060 గ్రామాల్లో 5.60 లక్షల మందికి ఉద్యోగాలు
జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’
- ఉద్యోగులకు 27 శాతం ఐఆర్
- అమ్మ ఒడి పథకం వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలు
- తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివించినా పేద తల్లులకు ఏడాదికి రూ.15 వేలు
- మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్ విద్యకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపు
- అక్టోబరు 1 నాటికి మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా తొలగింపు
- వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో అందరికీ ఇంటి స్థలాల పంపిణీ
- ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ
- వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు