వేడి తట్టుకోలేక ఏడాదికి ఎంతమంది మరణిస్తున్నారంటే ..

Update: 2019-11-02 05:44 GMT
బ్రహ్మంగారు చెప్పినట్టు కలికాలం అంతం కావడానికి రోజులు దగ్గర పడ్డాయా అంటే అవుననే సమధానం వినిపిస్తుంది. ఎందుకంటే మారుతున్న వాతావరణం ..అనతకుమించి మనుషుల్లో వచ్చిన మార్పు కలికాలం అంతం కాబోతుంది అని చెప్తుంది. మరో ముఖ్యమైన విషయం  ఏమిటంటే ..గత కొన్ని రోజులుగా అతివృష్టి లేదంటే అనావృష్టి .. తప్ప అవసరాలకి తగ్గట్టు వాతావరణం సహకరించడంలేదు. దానికి ఒక రకంగా కారణం మనమే. ఇష్టం వచ్చినట్టు వాహనాలని వాడుతుంటే వాతావరణంలో మార్పు రాక  ఇంకేం వస్తుంది చెప్పండి. చలికాలంలో  విపరీతమైన చలి. ఎండాకాలమొస్తే ఒళ్లు మంటెక్కిపోయే వేడి.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ తో పరిస్థితి నానాటికీ చేయి దాటిపోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎండ వేడి ధాటికి మన దేశంలో 2100 నాటికి ఏటా 15 లక్షల మంది బలైపోవాల్సి వస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని టాటా సెంటర్ ఫర్ డెవలప్మెంట్  స్టడీలో ఈ విషయం తేలింది.  ఈ శతాబ్దం చివరి నాటికి ఇండియా వార్షిక సగటు టెంపరేచర్లు 4 డిగ్రీలు పెరుగుతాయని స్టడీ హెచ్చరించింది. ప్రస్తుతం 24 డిగ్రీలుగా ఉన్న సగటు ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలకు పెరుగుతాయని చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత వేడి రోజులు 67కు పెరుగుతాయని, సగటు టెంపరేచర్లు 35 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. 2010లో వేడి రోజులు మూడు మాత్రమేనని తెలిపింది.

2100 నాటికి దేశంలో అత్యంత వేడిగా ఉండే రాష్ట్రం పంజాబ్ అని స్టడీ వివరించింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర సగటు టెంపరేచర్ 32 డిగ్రీలు కాగా, 2100 నాటికి 36 డిగ్రీలకు పెరుగుతుందని తెలిపింది. అత్యధికంగా 85 రోజులు వేడి రోజులుంటాయని తెలిపింది. ఎండాకాలం టెంపరేచర్ల పెరుగుదలలో హిమాలయ రాష్ట్రాలు ముందుంటాయని వివరించింది. వేడి వల్ల ఎక్కువగా చనిపోయే వారి సంఖ్య యూపీలోనే ఎక్కువగా ఉంటుందని టీఎస్డీ స్టడీలో తేలింది. ఏటా 4 లక్షల 2 వేల 280 మంది వేడికి బలైపోతారని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో లక్ష మంది చొప్పున చనిపోతారని తెలిపింది. ఈ ఆరు రాష్ట్రాల్లో వేడికి 64 శాతం మరణాలు సంభవిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2040 నాటికి ఇండియాలో కాలుష్యం స్థాయులు రెట్టింపు అవుతాయని, ప్రపంచంలోనే అతి పెద్ద కాలుష్య కారక దేశంగా ఇండియా నిలుస్తుందని చెప్పింది. ఇప్పటినుండైనా  కొంచెం జాగ్రత వహించకపోతే  ఈ మరణాల సంఖ్య  మరింతగా పెరిగే అవకాశం ఉంది అని తెలిపింది.
Tags:    

Similar News