జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రసంగించారు. తొలుత ఆయన ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఆర్థికసాయం చేశారు. ఈ సందర్బంగా వైసీపీ నేతలపైనా.. సీఎం జగన్ పైనా తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు. సినీమా డైలాగులు కూడా పేల్చారు. ఈ క్రమంలో సభకు హాజరైన జనాలు.. పెద్ద ఎత్తున ఈలలు చప్పట్లతో ప్రాంగణాన్ని(రూమే అనుకోండి) మోతమోగించారు. ముఖ్యంగా కులాల గురించి పవన్ మాట్లాడిన సమయంలో వారు మరింత రెచ్చిపోయారు.
ఇలా.. పవన్ ప్రసంగంలో ప్రతి సందర్భంలోనూ మహిళలు, యువకులు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఒక సందర్భంలో పవన్ .. తన ప్రసంగాన్ని ఒక నిముషం పాటు ఆపుకొని మరీ వారి చప్పట్లను , ఈలలను ఆస్వాదించారు కూడా! ఇక్కడ కట్ చేద్దాం. కొన్ని రోజుల కిందట.. విజయనగరంలో సభకు కూడా భారీ ఎత్తున జనాలు వచ్చారు. అక్కడా ఇదే సీన్ దాదాపు కనిపించింది. అక్కడ కూడా ఈలలు చప్పట్లు మోగాయి. ఇక, విషయంలోకి వస్తే.. అసలు ఈలలు.. చప్పట్లు కొడుతున్నారు సరే.. వీరిలో ఎంత మంది పవన్‌కు ఓటేస్తారు? అనేది చర్చ.
గత 2019 ఎన్నికల సమయంలోనూ.. దీనికి ముందుకూడా పవన్ నిర్వహించిన సభలకు ప్రజలు పోటెత్తారు. అప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. మరి ఆ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కేవలం 5-7., మరి ఇప్పటికి ఓటు బ్యాంకు పుంజుకున్నట్టేనా? అనేది చూడాలి.
ఇలా చూస్తే.. సబకు వచ్చిన వారిలో చాలా మంది పింఛను దారులు ఉన్నారు. అమ్మ ఒడి తీసుకుంటున్న వారు ఉన్నారు. జగన్ ఇస్తున్న విద్యాదీవెన అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. వీరికి మరో ఏడాదిన్నర పాటు ఇవన్నీ అందాల్సి ఉంది. సో.. వీరు ఇప్పుడు ఇక్కడ చప్పట్లు కొట్టినా.. నెలయ్యే సరికి ఆయా పథకాలకు చేతులు చాపాల్సిందే (పవన్ భాషలో).
సో.. దీనిన బట్టి.. ఎంత కాదన్నా.. ఇప్పుడు మోగుతున్న చప్పట్లు ఎన్నికల సమయానికి ఎటు తిరుగుతాయో పవన్ గుర్తించాల్సి ఉంది. వీరు కొడుతున్న చప్పట్లలో ఆయన మునిగిపోవచ్చు.. వీరి ఈలలు ఆయనకు ఆనందం కలిగించవచ్చు.
కానీ, వీటిని ఓట్లుగా మలుచుకుని.. సీట్లుదక్కించుకునేందుకు చేయాల్సింది చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఆదిశగా అడుగులు వేయకపోతే.. నటుడిగానే ప్రజలు చూస్తారు తప్ప.. నేతగా ఆదరించడం కష్టమని అంటున్నారు. ఈ విషయంలో ఏం చేయాలో ఇప్పటికైనా కార్యాచరణతో ముందుకు సాగాలని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.