బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఆదాయ పన్ను శాఖ (ఐటీ)లను ఉపయోగించి ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇక ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీకి ప్రయోజనం కలిగేలా ఈసీ వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నాయి. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాల్సిన ఈసీ కూడా బీజేపీ తానులో ముక్కలా పనిచేస్తోందని మండిపడుతున్నాయి.
ప్రతిపక్షాల విమర్శలకు తగ్గట్టే ఈసీ కూడా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ వాస్తవానికి ఒకేసారి విడుదల కావాల్సి ఉందని అంటున్నారు. అయితే ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉండటంతో ఆ రాష్ట్రంలో షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగా ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.
ముందుగా హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రమే కేంద్ర ఎన్నికల సం««ఘం అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రధాని మోడీ గుజరాత్ పర్యటన ఉందని.. ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించాల్సి ఉందని.. అందుకే ఆలస్యంగా గుజరాత్‌లో నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌తోపాటు గుజరాత్‌కు కూడా ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ఇస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి ప్రధాని మోడీ అభివృద్ధి పనులను ప్రారంభించలేరనే ఇలా చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటే మళ్లీ ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించకూడదని, వాటిని ప్రకటించకూడదని ఆదేశాలు జారీ చేయడం కూడా వివాదం రేపుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న గుజరాత్,హిమాచల్ ప్రదేశ్‌ల్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరుగుతున్నాయి.
అదేవిధంగా గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 5న సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు ఇలాంటి ఆదేశాలు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వకపోవడంతో ఈసీపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.