అప్పుల ఊబిలో పాక్ మొత్తం ఎంత అప్పుందంటే?
పాకిస్థాన్ .. దాయాది దేశం అని అందరం పిలుస్తుంటాం. అసలు పాకిస్థాన్ అనగానే ముందుగా కాశ్మీర్ సమస్య మాత్రమే మనకు గుర్తొస్తుంది. మనతో జరిగిన యుద్ధం వల్ల పాక్ ని ఎప్పుడూ శత్రు దేశంగానే భావిస్తాం. ఇదిలా ఉంటే .. ప్రస్తుతం ద్రవ్యోల్భణం పెరిగిపోవడం వల్ల రూపాయికి దొరకాల్సిన వస్తువు అక్కడ పది రూపాయలకు లభిస్తోంది. పాకిస్థాన్ ఇప్పుడు అప్పుల ఊబిలో మునిగిపోయింది. పాకిస్థాన్ మెడపై ఆర్థిక సంక్షోభం అనే కత్తి వేలాడుతోంది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. యుఏఈ తనకు పాకిస్థాన్ అప్పు బకాయి ఉన్న బిలియన్ డాలర్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసేంతగా గతంలో కూడా యూఏఈ ఇలాగే డిమాండ్ చేసింది.
అప్పుడు చైనా ముందుకొచ్చి పాకిస్థాన్ కి సాయం చేసింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా మారిన తర్వాత ఇలా ఒక దేశం నుంచి సహాయం తీసుకొని మరో దేశానికి అప్పులు తీర్చడం ఆ దేశానికి సాధారణ విషయంగా మారింది. 2019 డిసెంబర్ నాటికి పాకిస్థాన్ అప్పులు 40.94 ట్రిలియన్ రూపాయలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం గడువు లోనే పాకిస్థాన్ అప్పులు 45 ట్రిలియన్లకు పెరగడం గమనార్హం. ఈ లెక్కలు ఏవో కాకి లెక్కలు అస్సలు కాదు. పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించిన వివరాలివి.. పాకిస్థాన్ ఆర్థిక శాఖ రిపోర్ట్ కూడా దీన్ని బలపర్చింది. తాజాగా పార్లమెంట్ లో ఆ దేశ ఆర్థిక మంత్రి దేశానికి ఉన్న అప్పుల గురించి వెల్లడించారు. ఈ అప్పులన్నింటినీ పాకిస్థాన్ లో ఉన్న 21.66 కోట్ల మంది కి సమానంగా పంచితే ఒక్కొక్కరికీ లక్షా 75 వేల రూపాయల అప్పు ఉన్నట్లుగా తేలుతుంది.
ఈ అప్పులు ఇప్పుడు కొత్తగా చేసినవా, అంటే కొన్ని పాత అప్పులు.. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా మారిన తర్వాత చేసిన అప్పులు మరికొన్ని అని చెప్పుకోవాలి. అయితే పాకిస్థానీ న్యూస్ పేపర్ ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యాక ఈ అప్పులు 46 శాతం పెరిగాయట. ఇంతకుముందు కూడా పాకిస్థాన్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏమీ లేకపోయినా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పాలనలో మరింత దిగజారిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కరోనా వల్ల ఆర్థిక భారం ఎక్కువైంది. తమ దేశం పేద దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ పై భారం పడకూడదని చెబుతూ ఇమ్రాన్ లాక్ డౌన్ ని ఎత్తేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది.
గతంలో ఆర్థిక లోటు గురించి ప్రభుత్వం ఆఫీసర్లకు కూడా ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. కానీ తాజాగా పరిస్థితి విషమించడంతో ప్రజలందరికీ పరిస్థితిని వివరించింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతుగా ప్రయత్నించాలని వెల్లడించారు కానీ అసలు ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి వివరాలను మాత్రం బయటపెట్టలేదు. 2018 మధ్య నాటికి పాకిస్థాన్ కి ఉన్న అప్పుల విలువ 24.9 ట్రిలియన్ రూపాయలు. అప్పుడు ఈ అప్పును ప్రజలకు సమానంగా పంచితే లక్షా ఇరవై వేల రూపాయలు వచ్చేది.ఇప్పుడు అప్పులు పెరిగాయి కాబట్టి పెరిగిన జనాభా లెక్కన తీసుకున్నా లక్షా డెబ్భై ఐదు వేల అప్పు తేలడం గమనార్హం.