ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అంత వెళ్తోందా?

Update: 2021-04-10 15:30 GMT
ఏపీలో ఇసుక దుమారం చెలరేగుతూనే ఉంది. భారీగా ఇసుక ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం ఇసుకను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యిందని ఎవరిని అడిగినా చెబుతారు. ఆఖరకు వైసీపీ నిజమైన అభిమానులను అడిగినా ఈ విషయంలో అదే జరుగుతోందంటారు.

అలాంటప్పుడు ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ సెట్ చేయడం లేదన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఇసుక ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దళారుల పాలవుతోందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

దళారుల వలన ఇసుక పెద్ద ఎత్తున వేరే రాష్ట్రాలకు తరలిపోతోందని.. దాదాపు 80శాతం వెళ్తోందని టాక్. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేల వలన అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్లమాటలు ఎమైనా ప్రజలకు ఇసుక అందుబాటులో లేదని.. ఇసుక దోపిడీ జరుగుతోందని వారంతా ఘంఠాపథంగా చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందని.. ఎన్ని నవరత్నాలు ఇచ్చినా పనిచేయవు అని అంటున్నారు. ఇప్పటికైనా ఇసుకన సామాన్యులకు అందుబాటులో ఉంచి..  వారికి పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Tags:    

Similar News