కరోనా నేపథ్యంలో తీవ్రమైన ప్రభావానికి గురైన రంగాల్లో మీడియా ఒకటి. కరోనా వారియర్స్ లో కీలకస్థానంలో ఉన్నప్పటికీ.. మహమ్మారి కారణంగా మీడియాకు పడిన దెబ్బ అంతా ఇంతా కాదు. ఆర్థికంగా మీడియా మీద పడిన ప్రభావంతో ఆ సంస్థలలు విలవిలలాడాయి. కరోనా కాటుతో మీడియా.. వినోద రంగ పరిశ్రమ ఎంత భారీగా ప్రభావితం అయ్యిందన్న విషయాల్ని తెలిపే నివేదిక ఒకటి బయటకు వచ్చింది.
అంతర్జాతీయ కన్సెల్టెన్సీ కేపీఎంజీ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశీయ మీడియా.. వినోద రంగాలు ఏ మేర ప్రభావితమయ్యాయి అన్న విషయాలు వెల్లడయ్యాయి. 2018-19 మధ్య కాలంలో 1.75లక్షల కోట్ల ఆదాయం ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 శాతం తగ్గి రూ.1.40లక్షల కోట్లకు పరిమితమైనట్లు ఈ నివేదిక వెల్లడించింది. అయితే.. వచ్చే ఏడాది మాత్రం ఈ రంగం కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఈ రంగంలో 33 శాతం పెరుగుదల ఉంటుందన్న అంచనాల్ని ఈ నివేదిక వెల్లడించింది. డిజిటలైజేషన్ ఈ రంగానికి కీలకంగా మారనుందని చెబుతూనే.. ఒకప్పుడు తీవ్రమైన ప్రభావం చూపించిన ప్రింట్ మీడియా.. రేడియో.. టీవీ మీడియాల ప్రభావం మరింత తగ్గుతుందని పేర్కొంది.
2028 నాటికి 100 కోట్లకు డిజిటల్ మీడియా వినియోగదారులు చేరుకుంటారని చెబుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు వచ్చాయని.. కంటెంట్ నుంచి పంపిణీ వరకు డిజిటల్ టెక్నాలజీ పెరిగినట్లుగా పేర్కొంది. ఈ సాంకేతికతో ఖర్చులు.. సమయం ఆదా అవుతున్నాయని.. టీవీ మీడియాను డిజిటల్ మీడియా ప్రకటనలు.. ప్రచార ఆదాయం మించిపోనున్నట్లుగా అంచనా వేసింది. మొత్తంగా చూస్తే.. మిగిలిన రంగాల మాదిరే మీడియా రంగం కూడా కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైందని చెప్పక తప్పదు.