భార్యను కంట్రోల్ చేయడం ఎలా.. గూగుల్ లో వెతుకున్న భర్తలు?

Update: 2021-05-01 23:30 GMT
కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని మగ పుంగవులు అంతా వర్క్ ఫ్రం హోంతో ఇంట్లో బందీ అయిపోయారు. ఆడవాళ్ల రాజ్యంలో అష్టకష్టాలు పడుతున్నారు. అంతకుముందు ఉదయం, సాయంత్రం మాత్రమే భార్యలతో మాట ముచ్చట.. ఇంకేమైనా చేసేవారు. కానీ 24 గంటలు కళ్లముందే ఉండేసరికి భార్యల టార్చర్ భర్తలపై ఎక్కువైపోతోంది. భర్తల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందట..

ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న పురుషుల్లో ఇంట్లో ఉండే వారిలో ఫస్ట్రేషన్ పీక్ స్టేజీకి చేరిందని తెలుస్తోంది. దీంతో భార్యలపై ఈ ప్రతాపం చూపించారని.. ఫలితంగా మహిళలపై హిం గరిష్ట స్థాయికి చేరుకుందని అధ్యయనం తెలిపింది.

ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కు కూడా ఈ భార్య బాధితుల సెగ తగిలింది.. కరోనా లాక్ డౌన్ వేళ ప్రజలు గూగుల్ లో ఎలాంటి విషయాలు వెతికారనే విషయంపై న్యూజిలాండ్ లోని ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్ ఫ్లిక్ట్ స్టడీస్ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భార్యలపై ఎలా పైచేయి సాధించాలని ఎక్కువమంది మగవాళ్లు గూగుల్ లో వెతికినట్టు సర్వే గుర్తించింది.

లాక్ డౌన్ సమయంలో చాలా మంది పురుషుల్లో అభద్రత, నిరాశ, నిస్సహాయత పెరిగిందని.. దీంతో ఉద్దేశపూర్వకంగానే భర్తలు తమ భార్యలపై హింసలకు పాల్పడ్డారని తేలింది. ఈ హింస 31శాతం నుంచి 106 వరకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు.

లాక్ డౌన్ సమయంలో భార్యా బాధితులంతా 'భార్యను అదుపులో పెట్టడం ఎలా' ఎవరికి తెలియకుండా ఎలా కొట్టాలి అనే విషయాలను గూగుల్ లో ఏకంగా 16.50 కోట్ల సార్లు వెతికారని వర్సిటీ ప్రొఫెసర్ కాటెరినా తెలిపారు. ఇక 'భార్యను ఇంట్లోనే ఎలా చంపాలి?' అనే విషయాన్ని 17.80 కోట్ల సార్లు సెర్చ్ చేశారని అధ్యయనంలో తేలింది.
Tags:    

Similar News