ప్రధాని నరేంద్రమోడీ వారం రోజుల విదేశీ ట్రిప్ షురూ కావటమే కాదు.. నిన్న రాత్రి (శనివారం) ఆయన అమెరికాలో అడుగు పెట్టటం.. ఆయనకు భారీ స్వాగతం లభించటం తెలిసిందే. ఈ రోజు (ఆదివారం) అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హోడీ మోడీ పేరుతో భారీ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సభకు మోడీనే కాదు.. అదే సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరు కానుండటం విశేషంగా మారింది. హోడీ మోడీ అంటూ నిర్వహిస్తున్న ఈ సభ గురించి మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. అంతా బాగుంది కానీ.. ఇంతకీ ఈ హోడీ మోడీ అంటే అర్థమేందన్నది ఏ మీడియాలో చూసినా అర్థం కాని పరిస్థితి. అది తప్ప.. అన్ని విషయాల్ని చెప్పేస్తున్న తీరు చూస్తే.. అసలు విషయాన్ని చెప్పొచ్చు కదా? అన్న క్వశ్చన్ రాక మానదు.
చాలామందిని వేధిస్తున్న ఈ హోడీ మోడీ మాటకు అర్థమేందన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. హోడీ మోడీ అన్న పేరుతో నిర్వహిస్తున్న సభ.. అదేదో రిథమిక్ గా ఉందని పెట్టింది కాదు. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెప్పాలి. టెక్సాస్ లోని భారతీయ అమెరికన్లు ప్రధాని మోడీని హౌ డూ యూ డూ మోడీ అని పలుకరిస్తుంటారు. హౌ డూ యూ అనే మాటను టెక్సాస్ ప్రాంతంలో వాడే వాడుక భాషలో హోడీ అని అంటారు. మోడీకి ముందు హౌడీని చేరిస్తే రిథమిక్ గా ఉండటమే కాదు.. ఇట్టే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
అందుకే.. మోడీ వ్యూహకర్తల టీం అత్యంత వ్యూహాత్మకంగా హోడీ మోడీ పేరుతో భారీ సభను ప్లాన్ చేశారు. మరింత వివరంగా చెప్పాలంటే.. రెండు ముక్కల్లో హౌ డూ యూ డూ మోడీ అనే మాటను సింఫుల్ గా అందరి నోళ్లల్లో ఇట్టే నానేలా.. బహుళ ప్రాచుర్యం పొందేలా హోడీ మోడీ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఈ సభకు ఏకంగా 50వేల మంది హాజరు కావటం ఒక విశేషమైతే.. అమెరికా అధ్యక్షుడు.. భారత ప్రధాని కలిసి ఒక బహిరంగ సభలో వేదికను పంచుకోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. టెక్సాస్ చరిత్రలో ఇదో భారీ సభగా మిగిలిపోనుందన్న మాట వినిపిస్తోంది.