ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నెల 11న రాష్ట్ర సచివాయలం ప్రక్కన జరగనున్న నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సియం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు.
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారుల ను సిఎస్ ఆదేశించారు. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర గవర్నర్,రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు పొటోకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ మరియు సమాచారశాఖ అధికారులను శర్మ ఆదేశించారు.
అంతకు ముందు ముఖ్యకార్యదర్శి(పొలిటికల్) ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ.. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించివేదిక, అలంకరణ, ఆహ్వాన పత్రిక, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులుగా డిజిగ్నేట్ కాబడిన వారికి ఆహ్వానం పలకడం వంటి ఏర్పాట్లు, వారికి తగిన రవాణా సౌకర్యం వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.
ఇందుకుగాను ప్రోటోకాల్ డైరెక్టర్ కు సహకరించే విధంగా కొంతమంది ప్రోటోకాల్ అధికారులనునియమిస్తున్నట్టు ముత్యాల రాజు సిఎస్ కు వివరించారు. అదనపు డిజి శాంతి భద్రతలు రవిశంకర్ మాట్లాడుతూ.. నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని 11వతేదీన కరకట్ట రోడ్డులో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు.
రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు, మంత్రులుగా నియమించబడిన వారికి, ఎంపి, ఎంఎల్సి, ఎంఎల్ఏలు వంటి ప్రముఖుల వాహనాలు ప్రమాణ స్వీకార ప్రాంతానికి చేరుకునేలా కేటాయించామన్నారు. మిగతా వారి వాహనాలు ఇతర మార్గాల్లో వచ్చేలా తగిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అదే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈసమావేశంలో డిఐజిలు సి.త్రివిక్రమ వర్మ,రాజశేఖర్ సమాచారశాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.