ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు భారీ దోపిడీ: ఒక్కో దానికి రూ.2 వేల పైనే.

Update: 2022-01-24 05:30 GMT
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజూవారీ కేసులు రూ.3 వేలకు పైగానే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.  ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వేలో మరిన్ని కేసులు బయటపడుతున్నాయి. అయితే కొందరు లక్షణాలు కనిపించిన వారు కరోనా నిర్ధారణ కోసం టెస్టుల కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిర్దారణ కాకముందే వారి జేబులు గుళ్ల చేసుకునే పరిస్థితి ఎదురైంది. కరోనా నిర్దారణకు యాంటి జెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తారు. నిజ నిర్దారణ కోసం ఎక్కువ మంది ఆర్టీపీసీఆర్ ను సంప్రదిస్తున్నారు. ఇదే అదనుగా చేసుకొని కొన్ని ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు ఆర్టీసీఆర్ టెస్టుకు రూ.2 వేల రూపాయల పైనే వసూలు చేస్తున్నారు. ఇదే ఢిల్లీలో రూ.500కే చేస్తున్నారు. మరి తెలంగాణలో ఈ పరిస్థితి ఎందుకు ఉంది..?

దేశంలో కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. దీంతో చాలా మంది ముందు జాగ్రత్తగా కాస్త లక్షణాలు కనిపించగానే పరీక్షల కేంద్రాలకు వెళుతున్నారు. ఇదే అదనుగా భావించిన పరీక్ష కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అధికంగా వసూలు చేయడం గమనార్హం.

 కొవిడ్ ప్రారంభంలో ప్రైవేట్ లో చేయించుకోవాలనుకుంటే ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.2,200 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటివద్ద నమూనా తీసుకుంటే రూ.2,800గా నిర్ణయించారు. అయితే ఆ తరువాత దానిని రూ.850, ఇంటి వద్ద నమూనా తీసుకుంటే రూ.1200 చేశారు.  ప్రస్తుతం ల్యాబ్లో రూ.500, ఇంటివద్ద నమూనా సేకరిస్తే రూ.800గా ఉంది. అయతే ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు దీనిని పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చిన విధంగా వసూలు చేస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబ్లో కరోనా టెస్టు చేయించుకోవానుకుంటే ఆర్టీపీసీఆర్ ను రూ.500 నుంచి రూ.300కు తగ్గించింది. ఇంటివద్ద నమూనాలు సేకరిస్తే రూ.500 తీసుకోవాలని తెలిపింది. యాంటిజెన్ టెస్టుకు కేవలం రూ.100 వసూలు చేయాలని తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఒమైక్రాన్ కేసులు నమోదైనప్పటి నంచి ఎలాంటినిర్ణయం తీసుకోకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కొన్ని కేంద్రాలు రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పని సరి చేయడంతో వారు అడిగినంత ముట్టజెప్పని పరిస్థితి ఎదురైంది.

గతంలో కంటే ఇప్పుడు ఆర్టీపీఎస్ కిట్ల కొరత లేదు. ఉత్పత్తి అధికంగా ఉంది. ఆర్టీపీసీసీ ఒక్కో కిట్ ధర రూ. 50 లోపే ఉంటుందని కొందరు వైద్య సిబ్బంది తెలుపుతున్నారు. దీంతో ల్యాబ్ నిర్వాహకులు అధికంగా దోచుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీపీసీ నమూనాలు చాలా తక్కువగా సేకరిస్తున్నారు. గతంతో యాంటిజెన్ తో పాటు ఆర్టీసీపీఆర్ టెస్టులు చేసేవాళ్లు. దానిని కౌంట్ చేసేవాల్లు కాని ఆర్టీసీపీఆర్ టెస్టుల సంఖ్య లెక్కలోకి రావడం లేదని వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ ఫలితాలకు కనీసం రెండు రోజుల సమయం పడుతుండడంతో ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ల ల్యాబ్ లనే ఆశ్రయిస్తున్నారు. కానీ వారు ఇదే అదనుగా వేల రూపాయలు దోచుకుంటున్నారు.
Tags:    

Similar News