ఏపీలో ఆ కార్లకు రిజిస్ట్రేషన్లు చేయకుంటే.. తుక్కేనట!

Update: 2020-03-15 04:43 GMT
కొత్తగా కొనుగోలు చేసే టూవీలర్ కానీ.. కార్లను కానీ వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం ఉంది. కానీ.. తర్వాత చూద్దామన్న భావనతో చాలామంది లైట్ తీసుకుంటారు. అయితే.. ఇలా లైట్ తీసుకునే వారికి దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చే నిర్ణయాన్ని వెల్లడించింది ఏపీ రవాణా శాఖ. మారిన నిబంధనల ప్రకారం ఈ నెలాఖరు తర్వాత నుంచి బీఎస్4 వాహనాల్ని వినియోగించకూడదన్న సంగతి తెలిసిందే.

కాలుష్యాన్ని మరింత తగ్గించి.. పర్యావరణానికి మేలు చేసేలా బీఎస్ 6 వాహనాల్ని మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ నెలాఖరు వరకూ బీఎస్ 4 వాహనాల్ని కొనుగోలు చేసే వీలుంది. అలా కొన్న వాటిని ఈ నెలాఖరులోపు రిజిస్ట్రేషన్లు చేయించాల్సిందే. ఒకవేళ.. వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించే విషయంలో కాస్తంత నిర్లక్ష్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోంది ఏపీ సర్కారు.

బీఎస్ 4 వాహనాల్ని ఏప్రిల్ ఒకటి నుంచి అమ్మకూడదు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కంపెనీలు ఈ నెలాఖరు వరకూ తమ వద్ద ఉన్న బీఎస్ 4 వాహనాల్ని తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. బీఎస్ 6కు.. బీఎస్ 4 వెహికిల్స్ కు మధ్య ధరలో ఉండే తేడా కారణంగా కొందరు ఈ వాహనాల్ని కొనుగోలు చేస్తున్నారు.

ఈ వాహనాల్ని నెలాఖరులోపు రిజిస్ట్రేషన్లు చేయించకుంటే.. తర్వాత నుంచి ఆ కార్లను తక్కుగా పరిగణిస్తారు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వాహనాన్ని జఫ్తు చేసి.. తుక్కు కింద ట్రీట్ చేస్తారు. ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఎదురుచూస్తూ కొందరు.. నిర్లక్ష్యంతో మరికొందరు రిజిస్ట్రేషన్లను చేయించరు. అలాంటివారు పారాహుషార్ అంటున్నారు. బీకేర్ ఫుల్.
Tags:    

Similar News