అమెరికాలో మన వాళ్లు అగ్రస్థానాల్లో ఉండడమే కాదు.. పలు అక్రమాల్లోనూ చేతివాటం చూపిస్తున్నారు. ఇప్పటికే పెళ్లిళ్లు, సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాల పేరిట కన్సల్టెంట్ సంస్థలు స్థాపించి కొందరు భారతీయులు దొరికిపోయారు. ఇటీవల యాపిల్ సంస్థకే కన్నం వేశాడు ఓ భారతీయుడు.
యాపిల్ మాజీ ఉద్యోగి అయిన ఇతగాడు చేసిన పనికి ఏకంగా 17 మిలియన్ డాలర్లు యాపిల్ నష్టపోయింది.ఈ ఘటన మరిచిపోకముందే అమెరికాలో మరో భారతీయుడికి 13 ఏళ్ల జైలు శిక్ష పడింది.ఇప్పటికీ వ్యాపారాలు, మోసాల పేరుతో భారతీయులు పలు కేసుల్లో చిక్కుకుంటూనే ఉన్నారు.
అమెరికాకు చెందిన బ్లడ్ టెస్టింగ్ కంపెనీ థెరానోస్ మాజీ అధ్యక్షుడిగా ఉన్న రమేష్ సన్నీ బల్వానీకి దాదాపు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెట్టుబడిదారులను మోసం చేయడం.. రోగులకు అపాయం కలిగించడం వంటి ఆరోపణలపై అతను దోషిగా తేలాడు. బల్వానీ మార్చి 15, 2023లోపు లొంగిపోవాల్సి ఉంటుంది.. అతడికి ఈ నేరం కింద 155 నెలలు లేదా 13 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.
గత నెలలో ఎలిజబెత్ హోమ్స్, థెరానోస్ వ్యవస్థాపకుడు అయిన బల్వానీ వ్యాపార భాగస్వామికి కోర్టు ఇదే మోసం కేసులో 11 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ నేరంలో భాగస్వామిగా ఉన్న సన్నీకి కూడా తాజాగా జైలు శిక్ష పడింది.
కంపెనీ దిగిపోయే ముందు థెరానోస్ ఒక విప్లవాత్మక వైద్య పరికరాన్ని అభివృద్ధి చేసిందని హోమ్స్ బల్వానీ పేర్కొన్నారు. బల్వానీ సెప్టెంబరు 2009 నుండి జూలై 2016 వరకు థెరానోస్‌లో వివిధ హోదాల్లో పనిచేశాడు. అతను 2010 మరియు 2015 మధ్య పెట్టుబడిదారులపై మోసానికి పాల్పడ్డాడు.
$100 మిలియన్లు సంపాదించి 2014లో బ్రేక్ ఈవెన్ అవుతుందని బల్వానీ పెట్టుబడిదారులను ఒప్పించాడు. 2015లో $1 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించండని పెట్టుబడిదారులకు ఆశచూపాడు.. ఏది ఏమైనప్పటికీ, థెరానోస్ అందరి వద్ద డబ్బులు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడ్డాడు. 2014 , 2015లో థెరానోస్ తక్కువ ఆదాయాన్ని ఆర్జించగలదని బల్వానికి బాగా తెలుసినా పెట్టుబడిదారులను ఇలా మోసం చేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.