మనదేశంలో ఎన్నికల అంటేనే మందు, విందు, డబ్బుల పంపిణీ సర్వసాధారణ విషయాలుగా మారిపోయాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు విధించినా.. పోలీసులు ఎంత కాపుకాచినా మద్యం పంపిణీ మాత్రం ఆగదు. ఎన్నికలు ముగిసిన కొన్నిరోజులకు దుకాణాల్లో చాలా బ్రండ్స్ స్టాక్ కూడా ఉండవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా మద్యం ఏరులై పారింది. ఈ నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ. 2,567 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. సాధారణ రోజుల్లో నెలకు రూ. 1,700 కోట్ల దాకా సేల్ ఉంటుంది. కానీ ఎలక్షన్స్ టైంలో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. ఈ ఒక్కనెలలోనే 31,60,135 లిక్కర్ కేసులు, 23,85,597 కేసుల బీర్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
26, 27, 28 తేదీల్లోనే డిపోల నుంచి 860 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయనాయకులు మందు పంపిణీ చేస్తుంటారు. ముందగానే తమ దగ్గర స్టాక్ తెచ్చుకొని ఎన్నికలకు ఒకరోజు ముందు పంపిణీ చేస్తుంటారు. ఇక పార్టీ మిటింగ్లు పెట్టాలన్నా.. ర్యాలీలు తీయాలన్న మందు బాటిళ్లు పంచాల్సిందే. భారీ బహిరంగసభలకు జనాలను తరలించాలంటే ముందుగా వాళ్ల నాలుకను తడపకతప్పదు. ఈ వ్యవహారంలో ప్రజలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రాజకీయనాయకులే ప్రజలకు మద్యం, డబ్బు అలవాటు చేశారు.
ఇప్పుడు ఏ రాజకీయపార్టీ ర్యాలీ తీయాలనుకున్నా.. ఇంటింటి ప్రచారం చేయాలన్న.. ఓ నేత వెనక జనం ఉండాలంటే మద్యం, డబ్బు పంపిణీ చేయకతప్పని పరిస్థితి నెలకొన్నది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కన్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం పంపిణీ మరింత ఎక్కువగా ఉంటుంది.