షాకింగ్: 86 కోట్ల వసూళ్లు.. నెల్లూరులో ఘరానా మోసం

Update: 2020-10-07 17:30 GMT
నెల్లూరులో మాయగాళ్లు ఘారానా మోసానికి పాల్పడ్డారు. మనీ సర్క్యూలేషన్ స్కీమ్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.89 కోట్ల వరకు వసూలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో మనీ సర్క్యూలేషన్ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్కీమ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా బాధితుల నుంచి కోట్లలో వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి సుమారు రూ.89 కోట్ల వరకూ వసూళ్లు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.

నెల్లూరు నగరంలోని వేదాయపాళెం కేంద్రంగా వెల్ పే ట్రేడింగ్ కంపెనీ పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

కోటి 29 లక్షల రూపాయల నగదును దర్గామిట్ట పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News