హెడ్డింగ్ చూస్తే కాసింత ఆశ్చర్యపోవచ్చు కానీ.. ఫోటో చూస్తే మాత్రం మేం చెప్పింది ఎంత నిజమన్నది ఇట్టే అర్థం కావటం ఖాయం. తనకున్న పలుకుబడితో జగన్ పాదయాత్రను ఎంత తక్కువగా కవర్ అయితే అంత మంచిదన్నట్లుగా వ్యవహరించటం మొదట్నించి చూస్తున్నదే. పాదయాత్ర రోజులు గడుస్తున్న కొద్దీ అంతకంతకూ పెరుగుతున్న ప్రజాదరణ ఒక పట్టాన అర్థం కానిదిగా మారిందన్నది నిజం.
ఉత్తరాంధ్రలోకి జగన్ పాదయాత్ర మొదలైన నాటి నుంచి కెమేరా లెన్స్ లకు అందనట్లుగా ప్రజాభిమానం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వైనం టీడీపీ తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. తాజాగా జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లా గజపతి నగరంలో సాగుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చిన అశేష జనసందోహం కెమేరా లెన్స్ లకు ఓ పట్టాన పట్టని పరిస్థితి.
ఇసుక వేస్తే రాలనట్లుగా మారిన ఈ జనజాతర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత కష్టానికి ప్రతిఫలంగా చెప్పక తప్పదు. తామెంతగా ప్రచారం చేస్తున్నా.. జగన్ సభలకు అంతకంతకూ పెరుగుతున్న ఆదరణ టీడీపీ నేతలకు ఒక పట్టాన అర్థం కావట్లేదు. తాజాగా.. ఈ ఫోటోను చూస్తున్న తెలుగు తమ్ముళ్లకు భోజనం చేసేందుకు సైతం ఇష్టపడటం లేదని చెబుతున్నారు. పదేళ్ల విరామం తర్వాత ప్రజలు తమకిచ్చిన అధికారాన్ని నిలుపుకోవటంలో అడ్డంగా ఫెయిల్ కావటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమ తోపు బాబు ఏదో చేస్తాడని తామనుకున్నా.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని జగన్ తన చేతలలో చేసి చూపించిన వైనం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఏమి జనం.. ఏమి జనం అన్న మాటతో పాటు.. బాబు తీరును విమర్శిస్తున్న జగన్ కు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చే స్పందన తెలుగు తమ్ముళ్లకు చెమటలు పట్టిస్తోందని చెబుతున్నారు.