సీఎం జగన్ అవినీతి లేని ఏపీని నిర్మించాలని కంకణం కట్టుకున్నాడు. ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ పేరుతో పారదర్శక పెద్దపీట వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తే పోస్టులు ఊస్ట్ అని హెచ్చరించారు. అయితే వారంతా సరిగా ఉంటే సరిపోతుందా? వాళ్ల కింద ఉండే అనుచరుల మాట ఏంటి? ఇప్పుడు వారి దోపిడీ వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలకే కాదు.. జగన్ సర్కార్ కూడా మచ్చ పడుతోంది. ప్రకాశం జిల్లాలో ఓ ప్రభుత్వ కాలేజీ పోస్టులను మంత్రులు, ఎమ్మెల్యేలకే తెలియకుండా కొందరు కింది స్థాయి నేతలు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు జిల్లాలో వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా వైసీపీ సర్కార్ పై మచ్చ పడుతుండడం వైసీపీ శ్రేణులను కలవరుస్తోంది.
అది ప్రకాశం జిల్లాలోని ఐఐఐటీ కాలేజ్. ఇటీవల ఆ కాలేజీకి మంజూరైన పోస్టులను కోట్లకు అమ్ముకున్నారనే ప్రచారం ఇప్పుడు ఆ జిల్లాలో విస్తృతంగా సాగుతోంది. ఈ మేరకు నిరుద్యోగులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది నిజమా? లేక ఎవరైనా సృష్టించిన వదంతులా తెలియదు కానీ.. ఆ కాలేజీపై ఈ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున సాగుతోంది.
ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ఒంగోలు ఐఐఐటీ కాలేజీకి పలు పోస్టులు మంజూరు చేశారు. అవి పర్మినెంటా? లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలని తెలియకపోయినా మంత్రుల దగ్గర ఉన్న వాళ్లు, ఎమ్మెల్యేల దగ్గరున్నవాళ్లు లాబీయింగ్ మొదలుపెట్టారనే ప్రచారం సాగుతోంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే పెద్ద ఎత్తున నిరుద్యోగులకు వల వేసి టోకరా వేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు జిల్లాలో జోరుగా సాగుతోంది.
అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల దగ్గర ఉన్న వాళ్లు.. వాళ్లే ఏజెంట్ల మాదిరి ప్రతి పోస్టు వాళ్ల చేతుల్లోనే ఉన్నట్టు భ్రమ చూపించి అందరూ కలిపి కొన్ని కోట్ల రూపాయలు నిరుద్యోగులకు టోకరా వేశారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ మొత్తం భారీగానే ఉంటుందని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా పెద్ద ఎత్తున అనుచరులు ఏజెంట్స్ ను పెట్టి మరీ వసూలు చేశారంట.. ఏపీ సీఎం జగన్ ఓ వైపు అవినీతి లేని ఏపీని నిర్మించాలనే సదాశయంతో ముందుకెళ్తుంటే.. వైసీపీలో కొత్తగా చేరిన టీడీపీ నాయకులు ఈ విధంగా వసూళ్లు చేశారంట.. వీరి వల్ల వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని కింది స్థాయి నేతలు వాపోతున్నారు.
ఒరిజినల్ వైసీపీ వాళ్లు సైతం వాళ్ల పిల్లలకు ఉద్యోగాల కోసం టీడీపీ వాళ్లను ఆశ్రయిస్తున్నారంటే ఏ విధంగా అక్కడ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు వాపోతున్నారు. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బయటకు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేకు కూడా చెడ్డ పేరు వస్తోందని అంటున్నారు.ఇది తక్షణమే విచారణ చేసి వసూలు చేసిన వాళ్ల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లాలో మోసపోయిన ఆశావహులు అంటున్నారు.