సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన బజరంగ్ ‌దళ్ కార్యకర్తలు !

Update: 2020-09-23 09:50 GMT
ఏపీలో గత కొన్ని రోజులుగా ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య అంతర్వేది ఘటన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా , దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకి దారితీసింది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి తగిలింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి ఎన్నికైన తర్వాత.. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, మతమార్పిడులు కూడా పెరిగాయని భజరంగదళ్ కార్యకర్తలు సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చి , సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు.

వెంటనే అప్రమత్తమైన వారిని పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో  కాసేపు అక్కడ ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు సీఎం నివాసాన్ని ముట్టడించడంతో  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.  300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసి , రెండు వందల మీటర్ల దూరంలో భారీ కేడ్లు పెట్టారు. నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
Tags:    

Similar News