నమ్మరు కానీ ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో అంత భారీ బందోబస్తు

Update: 2019-12-09 07:04 GMT
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ దారుణ ఉదంతం ఒకవైపు.. అదే కేసుకు సంబంధించిన నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన వైనం మరింత సంచలనానికి తెర తీయటమే కాదు.. పెద్ద చర్చగా మారింది. నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసి ఇప్పటికి మూడు రోజులు గడిచినా.. దానికి సంబంధించినవేడి మాత్రం తగ్గని పరిస్థితి. దిశను దహనం చేసిన ప్రాంతానికి సమీపంలోనే ఎన్ కౌంటర్ చోటు చేసుకోవటం.. ఈ రెండు ఉదంతాలకు జాతీయస్థాయిలో భారీ చర్చ జరుగుతున్న వేళ.. ఆ రెండు ప్రాంతాలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన ప్రాంతం.. దిశను తగలబెట్టిన ప్లేస్ ను చూసేందుకు వస్తున్న ప్రజల్ని పోలీసులు అనుమతించటం లేదు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలోకి ప్రజల్ని వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. చటాన్ పల్లి దగ్గర చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని పరిశీలించేందుకు పెద్ద ఎత్తున అధికారులు వస్తున్నారు.

తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలోకి సామాన్యులు రాకుండా ఉండేందుకు వీలుగా 59 మంది పోలీసులతో కూడిన టీంతో భద్రతను నిర్వహిస్తున్నారు. ఇంత భారీగా భద్రతను ఏర్పాటు చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. పలువురు పోలీసు అధికారులు.. ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి వచ్చి.. ఎన్ కౌంటర్ జరిగిన తీరును అడిగి తెలుుకుంటున్నారు. ఈ రెండు ప్లేస్ ల్ని చూసేందుకు సాధారణ ప్రజలు విపరీతంగా వస్తుండటంతో ఆ ప్రాంతంలో రద్దీ నెలకొంది.
Tags:    

Similar News