కాంగ్రెస్ కు భారీ షాక్‌...ఈట‌ల వెంట బీజేపీలోకి మాజీ ఎంపీ

Update: 2021-06-11 17:30 GMT
తెలంగాణ‌లో త‌న ప‌ట్టు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీకి ఇంకో షాక్‌. మాజీ మంత్రి, ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్ వెంట బీజేపీలో చేరేందుకు హ‌స్తం పార్టీకి చెందిన మాజీ ఎంపీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ ర‌మేష్ ఈ మేర‌కు తాజాగా ఈట‌ల రాజేంద‌ర్ తో స‌మావేశం అయ్యారు. అనంత‌రం ఆయ‌న బీజేపీ తెలంగాణ ఇంచార్జీ త‌రుణ్ చుగ్ తో సైతం స‌మావేశ‌మ‌య్యారు. దీంతో షాక్ తిన‌డం కాంగ్రెష్ వంతు అయింది.

టీడీపీ సీనియ‌ర్ నేత‌గా ఉన్న రాథోడ్ ర‌మేష్ అనంత‌రం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే, ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే రేఖానాయ‌క్ తో స‌ఖ్య‌త లేక‌పోవ‌డం కార‌ణంగా ఆయ‌న ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డం మ‌రోవైపు బీజేపీ బ‌ల‌ప‌డుతున్న త‌రుణంలో రాథోడ్ ర‌మేష్ చూపు బీజేపీ వైపు ప‌డింది. గ‌త క‌ద్దికాలంగా ఈ మేర‌కు ఆయ‌న సందిగ్దావ‌స్త‌లో ఉన్నారు. అయితే, తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు.

బీజేపీలో చేర‌నున్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తో క‌లిసి కాషాయ కండువా క‌ప్పుకోవాల‌ని మాజీ ఎంపీ రాథోడ్ ర‌మేష్ డిసైడ‌య్యారు. ఈ మేర‌కు ఈట‌ల నివాసానికి వ‌చ్చిన త‌న అభిప్రాయం చెప్ప‌గా ఆయ‌న ఓకే చేసిన‌ట్లు స‌మాచారం. అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కాగా, ఈట‌ల తో క‌లిసి 14వ తేదీనే రాథోడ్ సైతం బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
Tags:    

Similar News