రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ఉన్నఆసక్తి అంతా ఇంతా కాదు. ఈ ఉప ఎన్నికల్లో విజయంకోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా ప్రయత్నాలు చేయటమే కాదు.. భారీ ఎత్తున కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. వందలాది కోట్లను మంచినీళ్ల మాదిరి వాడేస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపు మాత్రమే లక్ష్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ఉన్న ఆసక్తి అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఈటల ఓటమి కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా మారిన సీఎం కేసీఆర్ తీరు కారణంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా ఈటలకు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు ప్రధాన అనుచరుడు.. కరీంనగర్ కేడీసీపీ బ్యాంక్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నపింగిలి రమేశ్ భారీ దెబ్బ కొట్టారు. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ భావజాలంలో తాను ఇమడలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. ఆయన రాజీనామా వార్త విన్నంతనే.. ఆయన నోటి నుంచి ఏ మాట వస్తుందో అంచనాకు తగ్గట్లే ఆయన మాటలు ఉండటం గమనార్హం.
బీజేపీ భావజాలంతో ఇమడలేకపోతున్న ఆయన.. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఎందుకిలా అంటే.. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల తాను విపరీతంగా ఆకర్షితులైనట్లుగా ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఈటల వాదన మరోలా ఉంది. గతంలో ఎప్పుడూ లేనన్ని సంక్షేమ పథకాలు.. నిధులు భారీగా నియోజకవర్గానికి రావటాన్ని మర్చిపోకూడదని.. ఇదంతా ఉప ఎన్నికల్లో గెలుపు కోసమే అధికారపార్టీ వ్యవహరిస్తుందని చెబుతున్నారు.
ఉప ఎన్నిక ఎప్పుడున్న దానిపై క్లారిటీ లేకున్నా.. తన నియోజకవర్గంలో అదే పనిగా పర్యటిస్తూ.. తన వాదనను వినిపిస్తున్నారు. తాజాగా ఈటలకు తగిలిన షాక్ మాదిరే.. రానున్న రోజుల్లో ఆయనకు బలంగా ఉండే మరికొందరు కూడా కమలాన్ని వదిలేసి.. గులాబీ కారులోకి ఎక్కటం ఖాయమని చెబుతున్నారు. ఈటలకు ఇప్పుడు తగిలిన షాక్ కంటే కూడా.. రానున్న రోజుల్లో తగిలే షాక్ మరింత కష్టంగా ఉంటుందని..దానికి కూడా ఆయన సిద్ధమవ్వాలన్న మాట వినిపిస్తోంది. మరిన్ని ఎదురుదెబ్బల నేపథ్యంలో ఉప ఎన్నికలో తన లక్ష్యాన్ని ఈటల ఏ మేరకు చేరుకుంటారో చూడాలి.