హెల్మెట్ లేకపోయినా.. ట్రిపుల్ డ్రైవింగ్ చేసినా.. రాంగ్ రూట్లో వచ్చినా.. ట్రాఫిక్ పోలీసులు ఫొటోతీసి వాటిపై నిర్ణీత చలాన్లు విధిస్తూ వాహన ఓనర్లకు మెసేజ్లు పంపుతున్నారు. అయితే కొందరు ఇలాంటి ఫైన్లు ఎన్నో విధించినా వాటిని పట్టించుకోవడం లేదు. పైగా పోలీసులను తప్పించుకు తిరుగుతూ.. వాటిని కట్టకుండా యధావిధిగా బండి నడుపుతున్నారు. ఇటీవల ట్రాఫిక్, సివిల్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు.
ద్విచక్రవాహనంపై రెండు కంటే ఎక్కువగా చలాన్లు ఉంటే బండి సీజ్ చేస్తామని తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనం వెళ్తుండగా అతడికి పోలీసులు ఎదురయ్యారు. దీంతో అతడు తన వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. అయితే ఆ వ్యక్తి అలా పారిపోవడాన్ని గమనించిన పోలీసులు వాహనం నెంబర్ ఆధారంగా చలాన్ల వివరాలు చూశారు. దీంతో వారికి దిమ్మదిరిగే షాక్ తగిలింది.
ఇటీవల ట్రాఫిక్ ,సివిల్ పోలీసులు కలిసి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి. వాహనాలపై చలాన్లను కట్టకుండా తిరుగుతున్న వారి బండారం బయటపడుతోంది. కొందరు ఎంతో కాలంగా చలాన్లు చెల్లించకుండా పోలీసులను తప్పించుకు తిరుగుతున్నారు. అయితో వారిని పట్టుకునే సరికి చేసేదేమీ లేక ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. కానీ ఓ వాహనదారుడు మాత్రం పోలీసులు ఆశ్చర్యపోయే పనిచేశాడు. అతని చలాన్లను చూసి అవాక్కయ్యారు.
హైదరాబాద్లోని కాచిగూడ ఆలీకేఫ్ చౌరస్తాలో సోమవారం సాయంత్ర వాహనాల తనికా కార్యక్రమం చేపట్టారు పోలీసులు. ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో అటువైపు వచ్చే ద్విచక్ర వాహనాలను ఆపి వారి వద్ద హెల్మెట్, ధ్రువపత్రాలు ఉన్నాయా..? లేవా..? అని తనిఖీ చేస్తున్నారు. ఇంతలో అక్కడికి అంబర్ పేటకు చెందిన ఓ వ్యక్తి అటువైపు వచ్చాడు. ఇక్కడ పోలీసులు తనిఖీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నాడు. అయితే బైక్ పై దగ్గరికొచ్చిన ఆ వ్యక్తి పోలీసులను చూడగానే తన బైక్ ను అక్కడే వదిలి పారిపోయాడు.
అలా పారిపోవడాన్ని గమనించి పోలీసులు అతని వాహనాన్ని ఈ చాలెన్ యాప్ లో పరిశీలించారు. అంతే.. అతని బండిపై 179 చలాన్లు ఉన్నాయి. వీటన్నింటిలో ఒక్కటి కూడా అతడు చెల్లించలేదు. ఈ చలాన్లమొత్తం కలిపితే 42,475 రూపాయలు అవుతుంది.
ఈ వాహనం మెదక్ జిల్లాకు చెందిన రత్నయ్య పేరు మీద ఉంది. అయితే ఈ వాహనం అతనిదేనా..? అతనిదే అయితే ఎందుకు పారిపోయాడు..? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. గత కొంతకాలంగా పోలీసులు బైక్ పై రెండు కంటే ఎక్కువ చలాన్లను ఉంచుకోవద్దని, ఫైన్ వెంటనే చెల్లంచాలని సూచిస్తున్నారు. అలా ఉంటే బండి సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ఆ వాహనదారుడు తన బండి ఎలాగూ సీజ్ అవుతుందనే నేపథ్యంలో తన బైక్ కు అక్కడే వదిలిపారిపోయాడా..? అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.