టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీ ఎమ్మెల్యేతో ఏడుగురు టీడీపీ కార్పొరేటర్ల భేటి
పంచాయతీల్లో ఓటమి.. మున్సిపోల్స్ లో దారుణ పరాభవం.. వెరసి టీడీపీ నేతలు జారిపోతున్నారు. ఇక వైసీపీ దిక్కు అని ఫిక్స్ అయ్యారు. మేయర్ ఎన్నిక జరిగి రెండు రోజులు కాకముందే విశాఖలో తెలుగుదేశం కార్పొరేటర్లు జెండా పీకేసి వైసీపీ ఎమ్మెల్యేను కలవడం సంచలనమైంది. టీడీపీ క్యాడర్ ఓటములతో ఢీలా పడిపోయి అధికార పార్టీ వైపు చూస్తోందని అర్థమవుతోంది.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలో టీడీపీ తరుఫున గెలిచిన ఏడుగురు కార్పొరేటర్లు తాజాగా గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో భేటి కావడం చర్చనీయాంశమైంది. డివిజన్ల అభివృద్ధి గురించి అని చెబుతున్నా.. వెనుక వైసీపీలో చేరికే ప్రధానం అని తెలుస్తోంది.
ఏడుగురు కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్యేను కలవడంపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేతో ఎందుకు భేటి అయ్యారో వివరణ ఇవ్వాలని కోరింది. రెండు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వని పక్షంలో పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు కాకముందే టీడీపీ కార్పొరేటర్లు ఇలా వైసీపీ ఎమ్మెల్యేను కలవడం టీడీపీకి మింగుడుపడని వ్యవహారంగా మారింది. దీంతో మున్సిపల్ ఎన్నికల పరాజయంతో మరింత మంది కార్పొరేటర్లు వైసీపీ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 98 డివిజన్లలో 58 డివిజన్లు గెలుచుకొని సత్తా చాటింది. గ్రేటర్ మేయర్ పీఠం సాధించింది. దీంతో టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ బాట పడుతున్నారు.