తిరుపతి బైపోల్: వైసీపీ ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారే.. ఎందుకో తెలుసా?
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక.. అధికార పార్టీ వైసీపీ నేతలకు తలనొప్పిగా మా రింది. ముఖ్యంగా పార్టీకి ఉన్న 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందిరా? దేవు డా? అని తెగ ఫీలవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు ఎలాగూ వైసీపీదేనని.. ఆపార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. అయితే.. ఎటొచ్చీ.. ఇప్పుడు కావాల్సింది.. మెజారిటీ. దేశం మొత్తం తిరుపతి వైపు తిరిగి చూసేలా.. ఇక్కడ మెజారిటీ సాధించాలని ఇప్పటికే పార్టీ మంత్రులకు, నాయకులకు కూడా సీఎం జగన్ స్పష్టం చేశారు.
అంటే దీనిని బట్టి.. మెజారిటీని ముఖ్యంగా ఐదు లక్షల మెజారిటీ సాధించాలని సీఎం జగన్ నిర్దేశించుకు న్నారు. అయితే.. ఈ క్రమంలో ఏ ఒక్కరో ఇద్దరో.. ఈ స్థాయిలో మెజారిటీ సాధించడం కష్టమని భావించిన సీఎం జగన్.. కొత్త అభ్యర్థి, రాజకీయ వాసనలు కూడా లేని డాక్టర్ గురుమూర్తిని గెలిపించేందుకు కొత్త వ్యూహాన్ని తెరమీదికి తెచ్చారు. ఈ క్రమంలో యువ ఎమ్మెల్యేలు సహా అందరికీ ఓ ఫైన్ మాణింగ్ తాడేపల్లి హైకమాండ్ నుంచి ఫోన్లు వెళ్లాయి. దీంతో సంతోష పడ్డ ఎమ్మెల్యేలు.. జగన్ నుంచి కబురంటే ఎగిరిపడ్డారు.
అయితే.. చావు కబురు చల్లగా అన్నట్టుగా అసలు విషయం తెలిసిన తర్వాత.. వారి గుండెల్లో గుబులు బయల్దేరింది. విషయం ఏంటంటే.. గురుమూర్తిని గెలిపించే బాధ్యతను 150 మంది ఎమ్మెల్యేలపై జగన్ పెట్టారు. ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తిరుపతి పార్లమెంటు పరిదిలోని మండలాలు, పంచాయతీలు, గ్రామాలను పంచుకుని బారీ ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేలు సంబరపడ్డారు. అయితే.. మేటర్ ఇంత వరకే పరిమితమైతే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, ఆవెంటనే జగన్ బాంబు పేల్చారు.
ఏంటంటే.. గురుమూర్తిని గెలిపించేందుకు అవసరమైన.. నిధులు కూడా ఎమ్మెల్యేలే సమకూర్చాలని జగన్ ఆదేశించినట్టు ఎమ్మెల్యేల అనుచరులు చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకున్నారని తెలిసింది. అయితే.. వీరు మౌనంగా ఉండడంతో మళ్లీ అధిష్టానం నుంచి ఫోన్లుపై ఫోన్లు వచ్చాయని సమాచారం. ``ఏంటి ఏం చేశారు? `` అని కీలక సలహాదారు నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై ఎమ్మెల్యేలు తెగ ఫీలవుతున్నారు. `` పార్టీఆ అధికారంలో ఉంది. డబ్బులు సర్దు కునే వెసులుబాటు కూడా ఉంది. అయినా.. మాపై ఎందుకు పడుతున్నారు?`` అనేది ఆఫ్‌ది రికార్డుగా నాయకులు చెబుతున్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.