శ్రీశైలం వెళ్తున్నారా.? 1 కాదు..2 కాదు.. 43కి.మీల ట్రాఫిక్ జామ్

Update: 2019-08-12 09:20 GMT
శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు 10 గేట్లను 30 అడుగులు  పైకెత్తారు. దీంతో జలకళ ఉట్టిపడుతోంది. అంతేకాదు.. శ్రీశైలంలో జ్యోతిర్లింగం.. మహాశివుడిని దర్శించుకుంటే పుణ్యం పురుషార్థం. అటు ప్రకృతితో  పోతపోసినట్టుండే కొండలు, పరుచుకున్న పచ్చదనం.. ఇలా మూడు ఒకేసారి చూడవచ్చని శ్రీశైలంకు తెలుగు రాష్ట్రాల నుంచి పోటెత్తారు. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా సందర్శకులు తరలివచ్చారు. ఇక్కడే వచ్చింది తంటా..

ఇలా శ్రీశైలం పండుగ వచ్చేసరికి అందరూ పోటెత్తారు. శ్రీశైలం బాటపట్టారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఏకంగా 43 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. శనివారం మధ్యాహ్నం  12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరిన వారు కూడా  అర్థరాత్రి 2 గంటల వరకూ చేరుకోలేదు. అంతా ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో హాహాకారాలు చేస్తున్నారు. అనేకమంది వెనక్కి హైదరాబాద్ కు వెనుదిరుగుతున్నారు.

ఇక శ్రీశైలానికి చేరుకున్న భారీగా భక్తులతో మల్లన్న దర్శనానికి భారీ క్యూ నెలకొంది. ఉచిత దర్శనానికి ఏకంగా ఏడు గంటల సమయం పడుతోంది.  శ్రీశైలం మొత్తం భారీ వాహనాలు, భక్తులతో నిండిపోయింది.శ్రావణ మాసంలో  ఒకేరోజు లక్షన్నర మందికి పైగా వచ్చారని ఆలయ ఉద్యోగులు తెలిపారు.
Tags:    

Similar News