మనిషి ఆయుర్థాయం పెరిగింది.. దేశంలో టాప్ ఏ రాష్ట్రానిదంటే?

Update: 2022-04-06 05:34 GMT
ప్రతీఒక్కరికి నిత్యయవ్వనంతో ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది. కానీ మారుతున్న పరిస్థితుల్లో రోజురోజుకు మానవుడి సగటు ఆయుర్దాయం తగ్గుతూ పోతుంది. శాస్త్రవేత్తలు మానవుడి ఆయుర్ధాన్ని పెంచేందుకు ఎన్నోరకాల పరిశోధనలు చేస్తున్నారు. వీటిలో కొన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి.

అయితే రోజురోజుకు పుట్టుకొస్తున్న కొత్త రోగాలు.. పెరుగుతున్న కాలుష్యంతో సగటు మనిషి ఆయుర్ధాయం మాత్రం తగ్గుందన్నది వాస్తవం. కాగా కొన్ని దేశాల్లో మాత్రం సగటు ఆయుర్ధాయం 80కిపై మాటే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.  

ప్రపంచంలో ఆయుర్థాయం 90ఏళ్లు సగటు ఉన్న తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సృష్టించింది. ఈ దేశం బలమైన ఆర్థిక  వ్యవస్థను కలిగి ఆదర్శంగా నిలుస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడి ప్రజలకు తక్కువ రక్త పోటు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఉన్నాయి.

ఇక భారత్ విషయానికి వస్తే.. దేశంలో సగటు జీవితకాలం పెరిగింది. 1970లో 47.7 ఏళ్లు ఉంది..  1990లో భారతీయుల సగటు జీవిత కాలం 59.6 ఏళ్లు ఉండగా.. అది 2019 నాటికి వైద్య సదుపాయాలు, పౌష్టికాహారంపై ప్రాధాన్యత పెరిగి 70.8 ఏళ్లకు చేరింది. 2020 నాటికి ఇది 69.6 ఏళ్లకు చేరింది.

30 ఏళ్ల కాలంలో భారతీయుడి సగటు ఆయుష్షు కాలం పదేళ్లు పెరిగినా.. భారత్ లో మాత్రం పలు రాష్ట్రాల మధ్య తేడాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక అక్షరాస్యత గల కేరళ రాష్ట్రంలో సగటు ఆయుష్సు జీవితాకం 77.3 ఏళ్లకు చేరుకుంది. ఇక అత్యంత తక్కువగా ఉత్తరప్రదేశ్ లో మనిషి జీవితకాలం 66.9 ఏళ్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది.

జీవితకాలం పెరిగిన రాష్ట్రాల్లో యూపీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, బీహార్, అస్సాం, ఏపీ ఉన్నాయి. ఏషియా పసిఫిక్ అబ్జర్వేటరీ ఆన్ హెల్త్ సిస్టమ్స్ అండ్ పాలసీస్ అధ్యయనంలో ఈ విషయం తేలింది. తెలంగాణలో మాత్రం ఆయుర్థాయం పెరగకపోవడం ఒకింత షాక్ అనే చెప్పొచ్చు.
Tags:    

Similar News