హైదరాబాద్ లో జరిగిన నరబలిని పోలీసులు ఛేదించారు. చంద్రగ్రహణం రోజు హైదరాబాద్ చిలుకానగర్ లో దారుణం జరిగింది. నరరూప రాక్షుసులు ముక్కు పచ్చలారని పసిగుడ్డు ప్రాణం తీశారు. తలను నరికి ఓ మేడపై వదిలి మొండాన్ని కనిపించకుండా చేశారు. అయితే మేడపై బట్టలు ఆరేసేందుకు వచ్చిన ఓ మహిళకు నరికిన తల ప్రత్యక్షమవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మల్కాజ్ గిరి జోన్ డీసీపీ సీహెచ్ ఆర్. ఉమామహేశ్వర శర్మ దర్యాప్తు ప్రారంభించారు.
ఈ దర్యాప్తులో భాగంగా ఒళ్లు గగూర్పొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చిలుకానగర్ లో రాజశేఖర్ (35) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతని భార్య శ్రీలతకు గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. దీంతో వైద్యం కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో జ్యోతిష్యుల్ని సంప్రదించాడు. రాజశేఖర్ జాతకాన్ని చూసిన ఆ జ్యోతిష్యుడు చంద్రగ్రహణం రోజు చిన్నారిని బలిస్తే భార్యకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని సలహా ఇచ్చాడు.
జ్యోతిష్యుడు సలహామేరకు నరబలికి ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్న రాజశేఖర్ స్థానికంగా ఉండే మెకానిక్ నరహరి సాయం తీసుకొని అతని ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించాడు. ఆ క్షుద్రపూజల్లో చిన్నారి తలను వధించి..ఆ తలను రాజశేఖర్ తన ఇంటిపై ఉంచి ఏమీ తెలియనట్లు నటించాడు.
అయితే రాజశేఖర్ ఇంటిపై చిన్నారి తల ఉందని గుర్తించిన పోలీసులకు అతని పై అనుమానం రావడంతో తనస్టైల్లో విచారించారు. ఈ విచారణలో భార్యకోసమే చిన్నారిని వధించానని - నరబలికోసం కరీంనగర్ లోని ఓ తండా నుండి పాపను తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో నిందితుడు రాజశేఖర్ వెల్లడించాడు.
దీంతో రాజశేఖర్ కు సహకరించిన నరహరి - అతని కుమారుడు రంజిత్ - నరబలి ఇవ్వండని సలహా ఇచ్చిన పూజారి - పాపను మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రోకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా చిన్నారి తల దొరికినా.. మృతదేహం ఎక్కడుందోనని వెదికే పనిలో పడ్డారు పోలీసులు.