టైంమిషన్​ లో 2050 సంవత్సరానికి వెళ్దామా!

Update: 2020-09-27 03:30 GMT
భవిష్యత్​లో ఈ ప్రపంచం ఎలా ఉండబోతున్నది.. టెక్నాలజీ ఇంకా ఎంత అభివృద్ధి చెందబోతున్నది. మానవ సమాజంలో ఇంకా ఏయే జాడ్యాలు రాబోతున్నాయి. అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే 2050వ సంవత్సరంలో ఈ ప్రపంచం ఎలా ఉండబోతున్నది అన్న విషయంపై పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి.. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా కొన్ని అంచనాలు రూపొందించాయి. ఆ అంచనాల ప్రకారం 2050లో ఈ ప్రపంచం ఎలా ఉండబోతున్నదో చూద్దాం.. ఇవి కేవలం కొన్ని అంచనాల చెబుతున్న విషయాలే..

2050 నాటికి ప్రపంచజనాభా దాదాపు 960 కోట్లను దాటిపోతుందట.. అందులో 800 కోట్ల మంది ఇంటర్నెట్​ను వినియోగిస్తారట. అయితే మనదేశం మాత్రం జనాభాలో చైనాను దాటవేస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. 2032 నాటికే ఇండియా జనాభా 132 కోట్లతో చైనాకంటే ఎక్కువ అవుతుందట. ఇప్పటికే సముద్రాల్లో నీటిమట్టం గరిష్ఠంగా పెరిగి 5 పెద్ద ఐలాండ్​లను కోల్పోయాం. రానున్న 25 ఏళ్లలో మరో 3 ఐలాండ్​లు కూడా మునిగిపోతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

2050 నాటికి నిరుదోగ్యం మరింత పెరుగుతుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం రోబోల వాడకం పెరగడమే. ఇప్పటికే రోబోలు ఇంటి పనిని, వంట పనిని కూడా చేస్తున్నాయి. 2050 నాటికి వీటి వాడకం మరింత పెరుగుతుందట.. తక్కువ ధరకు అందుబాటులో రావడంతో సామన్య ప్రజలు కూడా రోబోలు వాడతారట. అందువల్ల నిరుద్యోగం పెరుగుతుందని సమాచారం.

దాదాపు 50 శాతం మంది తమ ఉద్యోగాలను కోల్పోతారు. 2050 నాటికి క్యాన్సర్​తో చనిపోయే మనిషే ఉండరట.. ఏ స్టేజిలో క్యాన్సర్​ను గుర్తించినా అందుకు వైద్యం అందుబాటులోకి వస్తుందని టాక్​. మరోవైపు క్యాన్సర్​ మహమ్మారి పూర్తిగా అంతరించిపోయిన ఆశ్చర్యపోవలిసిన అవసరం లేదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

పెట్రల్​ వాడకం బంద్​

2050లో నాటికి ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు వాహనాలు ఉండవట. కేవలం సోలార్​, హైడ్రోజన్​ టెక్నాలజీతోనే వాహనాలు నడుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. టీవీ, లైట్లు, ఇతర గృహోపపకరణాలన్నీ ఇంటర్నెట్​కు అనుసంధానించి ఉంటాయి. వాటిని మన చేతిలో ఉన్నమొబైల్ ఫోన్లతో నియంత్రించవచ్చు.

అగ్రరాజ్యంగా భారత్​

లండన్​కు చెందిన ట్రైస్​వాటర్​ హౌస్​కూపర్​ అనే సంస్థ చెప్పిన సర్వే వివరాల ప్రకారం.. 2050 నాటికి భారత్​ అగ్రరాజ్యంగా అవతరిస్తుందట. అయితే అప్పుడు చైనా ప్రపంచంలోనే నంబర్​ 1 స్థానంలో ఉండగా.. భారత్​ రెండో అగ్రరాజ్యంగా అవతరిస్తుందని ఈ సర్వే చెబుతోంది. అమెరికాను కూడా భారత్​ వెనక్కి నెట్టేస్తుందట. నీటిలో పడినా తడవని ఫోన్లు , చేతిలో పెట్టుకొని మడిచిపెట్టుకొనే ఫోన్లు, కాగితం మాదిరి ఉండే ఫోన్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు పరిశోధకులు.

శిశుమరణాలు తగ్గుతాయి. హెచ్​ఐవీ మహమ్మారి అంతరించిపోతుందట. మలేరియా మొత్తానికి పోతుందట. గేలు, లెస్బియన్లు కూడా ప్రత్యేక పద్ధతుల్లో బిడ్డలను కంటారట. వృద్ధుల జనాభా మరింత పెరుగుతుంది. ఇప్పుడున్న దానికంటే మూడురెట్లు అధికసంఖ్యలో వృద్ధులు ఉంటారట. గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులులతోపాటు కళ్లు, చెవులు, చేతులు కూడా మూల కణం సాయంతో ప్రయోగశాలల్లోనే తయారుచేసి మనుషులకు అమర్చుతారట. సాధారణ ప్రజలు కూడా అంతరిక్ష యాత్రలు చేస్తారట. ఇవన్నీ కేవలం పరిశోధన ఆధారంగా చెబుతున్న అంచనాలే..
Tags:    

Similar News