ముస్లింలు హ్యాపీగా మతం మారిపోతున్నారు

Update: 2015-09-07 10:04 GMT
ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాక.. ఎప్పుడు ఎక్కడ ఏ ఘోరం చోటు చేసుకుంటుందో అర్థం కాక.. ప్రాణభయంతో బిక్కచచ్చిపోయి.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పరుగులు తీస్తున్న సిరియా.. ఇరాక్ కు చెందిన ముస్లింలు.. ఇప్పుడు యూరప్ దేశాలకు పయనం కావటం తెలిసిందే.

తమ దేశాల్లో రోజురోజుకి బలపడుతున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదం దెబ్బకు ఠారెత్తిపోయిన వారు.. బతికి ఉంటే బలుసాకు తినొచ్చన్న చందంగా వారు యూరప్ దేశాల బాట పడుతున్నారు. ఇలా యూరప్.. ఆస్ట్రేలియా తదితర దేశాల బాట పడుతున్న శరణార్ధులు ఇప్పుడు తమ మతాన్ని మార్చుకోవటానికి ఎలాంటి మొహమాట పడటం లేదు.

మతం కారణంగా నరకం చూసిన వారికి.. మతం మారి ప్రశాంతంగా బతకొచ్చన్న ఆలోచన.. వారిని మరో ఆలోచన లేకుండా ముస్లిం నుంచి క్రిస్టియన్లుగా మారటానికి వారు ఓకే చెప్పేస్తున్నారు. ఐరోపాలోని కొన్ని దేశాలు.. కేవలం క్రిస్టియన్లు మాత్రమే అనుమతించటంతో.. తాము కూడా మతం మారేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ వారు మతం మారిపోతున్నారు.

బెర్లిన్ సమీపంలోని చర్చిలో మతం మారేందుకు వేలాది మంది బారులు తీరటం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. నువ్వు ఇస్లాం వదిలేస్తున్నావా? అంటే అవునని చెబుతున్న వారు.. సైతాను.. అతని రాక్షస సంతతికి దూరంగా ఉండాలని భావిస్తున్నావా? అని అడిగితే మారు మాట్లాడకుండా అవునని చెప్పటం గమనార్హం.
Tags:    

Similar News