కొండచరియలు విరిగిపడి 100 మంది మృతి..ఎక్కడంటే ?

Update: 2020-07-02 13:00 GMT
మయన్మార్‌ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జేడ్ అనే గని వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కనీసం 100 మంది మరణించి ఉంటారని మయన్మార్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని అగ్నిమాపక సేవా విభాగం, సమాచార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు నిర్దారించారు.

మరణించిన వారిలో ఎక్కువగా మైనర్లు ఉండటం గమనార్హం. భారీ వర్షం కారణంగా గనిలో కొండ చరియలు విరిగి పడి ఉంటాయని అగ్నిమాపక సేవా విభాగం, సమాచార మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. కాచిన్ రాష్ట్రంలోని జేడ్ - రిచ్ హెచ్‌పకాంత్ ప్రాంతంలో కొందరు మైనర్ బాలురు తమకు అవసరమయ్యే రాళ్లను ఏరుతుండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడ్డట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడగా.. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. అధికారులు యుద్ద‌ప్రాతిప‌దిక‌న‌ సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్న‌ట్లు సమాచారం.

అయితే మైనర్లు ఆ గనివైపు వెళ్లేందుకు, అక్కడ తిరిగేందుకు పర్మిషన్ ఉందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, రెండేళ్ల కిందట ఇదే జేడ్ గనిలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో దాదాపు 20 మంది మరణించడం తెలిసిందే.
Tags:    

Similar News