లాక్ డౌన్ బేఖాతరు: 100మంది ప్రార్థనలు

Update: 2020-04-12 08:58 GMT
చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు - పోలీసులు ఎంత కష్టపడుతున్నా కొందరి అవివేకం వల్ల మళ్లీ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే నిజాముద్దీన్ ఘటనతో దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజాగా అలాంటి మరో ఉపద్రవమే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాయి. ఇళ్లకే పరిమితం అవ్వాలని మరిన్ని కఠిన ఆంక్షలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. తాజాగా బెంగాల్ లో స్వీట్ - పాన్ - పూల మార్కెట్లన్నీ తెరవాలంటూ దీదీ ఆదేశాలు ఇవ్వడం దుమారం రేపింది. కరోనా వ్యాప్తి వేళ మమత తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిచ్చింది.

తాజాగా లాక్ డౌన్ నిబంధనలు బెంగాల్ లో సరిగా అమలు  కావడం లేదు. లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో ఓ మసీదులో ఏకంగా 100 మంది సామూహిక ప్రార్థనలు చేసిన వైనం కలకలం రేపింది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి చూసే సరికి 100 మంది కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే అక్కడి నుంచి వారిని పంపించేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బెంగాల్ లో ఇప్పటికే 134 కేసులు - ఐదుగురు మరణించినా జనాల్లో కరోనా భయం లేకుండా పోయింది. బెంగాల్ సీఎం తీరు కూడా అక్కడ కరోనా పెరుగుదలకు కారణమవుతోంది.

    

Tags:    

Similar News