ఇర్మాతో క‌రేబియ‌న్ దీవులు స్మాష్‌

Update: 2017-09-07 07:50 GMT
ప్ర‌పంచానికి పెద్దన్న అయిన అమెరికాకు ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ప్ర‌కృతి ప్ర‌కోపంతో ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న ఆగ్ర‌రాజ్యం.. తాజాగా ఇర్మా ధాటికి ద‌క్షిణ ఫ్లోరిడా ఏమ‌వుతుంద‌న్న భయాందోళ‌న‌లో మునిగిపోయింది. ఇప్ప‌టికే హార్వే హ‌రికేన్ ధాటికి టెక్సాస్ న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. దీని నుంచి ఎప్ప‌టికి బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న దానిపై ఇప్ప‌టికే అంతు చిక్క‌ని వేళ‌.. ఇర్మా రూపంలో మ‌రో పిడుగు అమెరికా మీద పడేందుకు రెఢీ అయ్యింది.

కేట‌గిరి 5గా చెబుతున్న ఈ హ‌రికేన్ ఇప్పుడు ద‌క్షిణ ఫ్లోరిడా దిశ‌గా ప‌య‌నిస్తోంది. ఇర్మాను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌ని భావిస్తున్న ఇర్మా హ‌రికేన్ కార‌ణంగా క‌రేబియ‌న్ దీవుల్ని తీవ్రంగా న‌ష్ట‌ప‌ర్చింది. ప్ర‌చండ గాలులు.. వ‌ర్షాల‌తో అంటిగ్వా.. బార్బుడా.. ప్యూర్టోరికో.. సెయింట్ మార్టిన్ దీవులు ప్ర‌భావిత‌మ‌య్యాయి.

ఇర్మా ధాటికి ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు భ‌వ‌నాలు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోయాయి. బార్బుడా అయితే మొత్తంగా శిధిల‌మైపోయింద‌ని చెబుతున్నారు. విద్యుత్ వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తింద‌ని.. పెద్ద ఎత్తున ఇళ్ల పైక‌ప్పులు ఎగిరిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇర్మా ధాటికి బార్బెడా పూర్తిగా దెబ్బ తింద‌ని.. మొత్తంగా శిథిల‌మైంద‌ని.. నేల మ‌ట్టం అయిన‌ట్లేన‌ని అంటిగ్వా.. బార్బుడా ప్ర‌ధాని గాస్ట‌న్ బ్రౌన్ వెల్ల‌డించారు. ఇర్మా కార‌ణంగా 95 శాతం ఆస్తులు ధ్వంస‌మ‌య్యాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఇర్మా కార‌ణంగా ప్రాణ న‌ష్టం ఎక్క‌వేనంటున్నారు. 1800 మంది జ‌నాభా ఉన్న బార్బుడా దీవి ఇక నివాస‌యోగ్యం ఎంత‌మాత్రం కాద‌ని చెబుతున్నారు.

ఇర్మా హ‌రికేన్ కార‌ణంగా జ‌రిగిన న‌ష్టంతో బార్బుడా దీవిని పున‌ర్నిర్మించ‌టానికి సుమారు 150 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు అవ‌స‌రం అవుతుంద‌ని చెబుతున్నారు. ఇంత‌లా న‌ష్ట‌ప‌రిచిన ఇర్మా..  ఫ్లోరిడాపై మ‌రెంత‌గా విరుచుకుప‌డుతుందో?
Tags:    

Similar News