మిలియ‌న్ మార్చ్‌...ఇప్పుడు అక్క‌డ

Update: 2015-10-31 07:05 GMT
మిలియ‌న్ మార్చ్‌... ప్ర‌త్యేక తెలంగాణ రాష్ర్టం కోసం సాగిన ఉద్య‌మంలోఈ ఘ‌ట్టానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఉద్య‌మ‌కారులంతా హైద‌రాబాద్‌ లోని ట్యాంక్‌ బండ్ ఒడ్డుకు చేరి త‌మ స‌త్తా చాటారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక రాష్ర్టం ఏర్పాటుచేయాలంటూ నిన‌దించారు. మిలియ‌న్‌ మార్చ్ కార‌ణంగా అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వంలో ఓ కుదుపు వ‌చ్చిందంటే మిలియ‌న్ మార్చ్ స‌త్తాను అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఇపుడు మ‌రో మిలియ‌న్ మార్చ్ జ‌ర‌గ‌నుంది. ఆ కార్య‌క్ర‌మం క‌శ్మీర్‌ లో జ‌ర‌గ‌నుంది.

హురియత్‌ వేర్పాటువాద నాయకుడు సయ్యద్‌ అలీ జిలాని "మిలియన్‌ మార్చ్"  పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్‌ 7న కాశ్మీర్‌ లోయను సందర్శించనున్న సమయంలో ఆయ‌న‌ ప్రసంగించే వేదికకు కొన్ని మీటర్ల దూరంలోనే 'ఈ మార్చి' చేయడానికి తలపెట్టారు. ర్యాలీ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని త‌మ‌ పార్టీ కోరిందని హురియత్‌ అధికార ప్రతినిధి అయాజ్‌ అక్బర్‌ తెలిపారు. మిలియన్ మార్చ్‌ను శ్రీనగర్‌లోని టూరిస్టు రిసెప్షన్‌ సెంటర్లో నిర్వహించాలని, బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మోడీ ఈ ర్యాలీని చూడాలని అక్బర్‌ అన్నారు. ఇది స్పష్టమైన ప్రజాభిప్రాయ సేకరణగా నిగ్గు తేలుతుందన్నారు.

కాశ్మీర్‌ సమస్య తీవ్రవాదానికి సంబంధించింది కాదని, స్థానిక ప్రజల హక్కులకు-ఢిల్లీ పాల‌కుల వాగ్దానాలకు నిలబెట్టుకోని తీరుకు సంబంధించిందని అక్బర్‌ అన్నారు. ఈ మార్చ్‌ లో పాల్గొనాల్సిందిగా ఇతర వేర్పాటువాద నాయకులను సైతం జిలానీ ఆహ్వానించారు. ఈ మార్చ్‌ శాంతియుతంగా జరుగుతుందని, దానికి బాధ్యత తమదేనని అక్బర్ చెప్పారు. ఎటువంటి శాంతిభద్రల సమస్యా ఏర్పడదని, ట్రాఫిక్‌ కు కూడా అంతరాయం కలగనివ్వమని చెప్పారు.
Tags:    

Similar News