రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని దంగేటి శ్రీగౌతమి యాక్సిడెంట్ కేసు అనూహ్య మలుపుతిరింది. ఆమె చెల్లెలు ఆరోపిస్తున్నట్టు ఇది యాక్సిడెంట్ కాదు పక్క ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. టీడీపీ నాయకులు లాబీయింగ్ తోనే ఈ కేసును నీరుగార్చారని తేటతెల్లమైంది. యాక్సిడెంట్ అయిన 15 రోజులకే తూతూ మంత్రంగా దర్యాప్తు పూర్తి చేసి కేసును నీరుగార్చిన పోలీసులకు జలక్ ఇస్తూ సీబీసీఐడీ రంగప్రవేశం చేసి పున: విచారణ చేసి హత్యకేసుగా నమోదు చేశారు.
2017 జనవరి 18న రాత్రి 8.30 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పరిధిలోని దిగమర్రు కొత్తోట పంచాయతీ పరిధి నరసాపురం-పాలకొల్లు మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రి పని మీద పాలకొల్లు వెళ్లిన అక్కాచెల్లెళ్లు శ్రీగౌతమి-పావనీలు యాక్టివా ద్విచక్రవాహనంపై నరసాపురం వస్తుండగా.. వెనుక నుంచి ఇన్నోవా ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అక్క శ్రీగౌతమి మృతిచెందగా.. చెల్లి పావని మాత్రం రెండు రోజుల తరువాత సృహలోకి వచ్చింది. టీడీపీ నేత సజ్జా బుజ్జి తమపై హత్యాప్రయత్నం చేశాడని చెప్పింది. అంతేకాదు బుజ్జి రహస్యంగా తమ అక్క శ్రీగౌతమిని రెండో పెళ్లి చేసుకున్నాడని.. అడ్డుగా ఉందని ఆరోజు యాక్సిడెంట్ చేయించాడని ఆరోపించింది. పెళ్లి ఫొటోలను కూడా విడుదల చేసింది.
శ్రీగౌతమిది హత్యేనంటూ ఆమె సోదరి పావని, తల్లి అనంతలక్ష్మి ఎందరో నేతలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలీసులకు కాళ్లావేళ్లా పడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బుజ్జి టీడీపీ నేత కావడం.. పైగా ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎవరూ శ్రీగౌతమి కుటుంబం వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి దర్యాప్తు అధికారులు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కేసును నీరుగార్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బుజ్జికి సీఎం సన్నిహితులు సహాయపడ్డారనే విమర్శలు వచ్చాయి. సీఎం సామాజికవర్గానికి చెందిన ఇద్దరు బడా వ్యక్తులు ఈ వ్యవహారం నడిపారని.. వారికి లోకేష్ బాబు సహకరించాడనే రూమర్స్ కూడా వచ్చాయి.
కేసును నీరుగార్చినా శ్రీ గౌతమి సోదరి పావని మాత్రం ధైర్యంగా అక్కకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి దిగింది. పోలీసు ఉన్నతాధికారులతోపాటు సీబీ సీఐడీని ఆశ్రయించింది. కోర్టులో కూడా ఫిర్యాదు చేసింది. ఎట్టకేలకు సీఐడీ జోక్యం చేసుకొని కేసును ప్రాథమికంగా విచారణ చేయడం.. కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేసి ఇది హత్యేనని తేల్చారు.
శ్రీగౌతమి ని యాక్సిడెంట్ చేసింది ఇద్దరు కిరాయి హంతకులు విశాఖపట్నానికి చెందిన పాకాలా సందీప్, కడియం దుర్గాప్రసాద్ అని పోలీసులు తేల్చారు. వారి ఖాతాలో రెండు సార్లు పెద్ద మొత్తంలో డబ్బులు వేసినట్లు గుర్తించారు. ఏ ఖాతా నుంచి డబ్బులు పడ్డాయన్న వివరాలతో తీగ లాగితే డొంకంతా కదిలింది. అంతేకాకుండా నరసాపురం జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాపం హస్తం కూడా ఉన్నట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించినట్టు సమాచారం. బుజ్జితోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెబుతున్నారు.