భార్య నగ్న వీడియోలతో డబ్బు సంపాదన..

Update: 2020-11-23 13:10 GMT
డబ్బు కోసం నీచ పనికి తెగబడ్డాడో ప్రబుద్ధుడు. భార్యకు రక్షణగా ఉండాల్సిన ఓ భర్త తన భార్య నగ్న వీడియోలను పోర్న్ సైట్ కు అప లోడ్ చేశాడు. ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనతో అతని చేష్టలకు మహిళా లోకం దుమ్మెత్తి పోస్తోంది. కంచే చేను మేసినట్లుగా ఆ భర్త చేసిన దుర్మార్గ పనిపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

గుంటూరు జిల్లాలోని పాత గుంటూరుకు చెందిన రైల్వే లోకో ఫైలట్ కుమారుడు కి నగరంలోని ఏటీ ఆగ్రహానికి చెందిన ఓ యువతికి 2017లో వివాహం అయింది. నిందితుడు ఎంబీఏ పూర్తి చేశానని, ఏయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నానని చెప్పినా పెళ్లి తరువాత ఆరా తీస్తే అతడు కార్గో లో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయినా సరేనని ఒప్పుకొని సక్రమంగా అతనితో వివాహిత కాపురం సాగించింది.

నిందితుడు అక్కడ ఉద్యోగం మానేసి పలు కార్యాలయాల్లో ఉద్యోగాల్లో జాయిన్ అవుతూ మానేశాడు. చివరికీ ఎక్కడా నిలదొక్కుకోక ఇంట్లో ఖాళీగా ఉండిపోయాడు. దీంతో ఆర్థికంగా కుంగిపోయిన అతడు వక్రబుద్ధితో డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకు ఫోర్న్ సైట్ లో తన భార్య ఫోటోలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆమె నిద్రపోతున్న సమయంలో న్యూడ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలను తీసి పోర్న్ సైట్ కు అప్ లోడ్ చేసి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా యూట్యూబ్ లలో పెట్టాడు. ఆ తరువాత ఆమెను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఒప్పొకోని ఆమె దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గుంటూరు డీఎస్పీ సుప్రజ ఈ కేసు విషయంలో సీరియస్ అయింది. దీంతో డీఎస్పీ అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డికి చెప్పడంతో కేసు నమోద చేసుకున్నారు. ముందుగా వివాహిత ఫొటోలు, వీడియోలు పబ్లిక్ కాకముందే డెలిట్ చేసే పనిలో పడ్డారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆయన చెప్పిన మరికొన్ని విషయాలకు పోలీసులు షాక్ తిన్నట్లు సమాచారం. మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురైనా దిశ పోలీస్ స్టేషన్ ను కలువాలని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News