మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అనుప్పూర్ గ్రామానికి వైద్యసేవలు అందని ద్రాక్ష. ఆ ఊరికి ఆసుపత్రి చాలా దూరం. పైగా రోడ్డు లేదు. దీంతో రోగ మొస్తే చావాల్సిందే.. లేదంటే మంచంపై రోగులను కట్టి మోసుకుపోవాల్సిందే..
తాజాగా అనుప్పూర్ లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసిన భర్త అల్లాడిపోయాడు. ఆ ఊరిలో ఆసుపత్రి లేకపోవడం.. అంబులెన్స్ కూడా రావడానికి రోడ్డు కూడా లేకపోవడంతో తల్లిడిల్లిపోయాడు.
దీంతో భార్యను మంచం మీదే పడుకోబెట్టి .. కొడుకు, మనవళ్ల సాయంతో ఆసుపత్రికి మోసుకెళ్లాడు.
తమ అనుప్పూర్ గ్రామానికి కనీసం విద్యుత్, రోడ్డు, మౌళికసదుపాయాలు ఏవీ లేవని.. గత సార్వత్రిక ఎన్నికలనే గ్రామస్థులు బహిష్కరించారు. దీంతో ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ తర్వాత వదిలేసింది.
ప్రస్తుతం భార్యను మంచంపై మోసుకెళ్లిన భర్త వ్యవహారం మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు షేర్లు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఊరు కూడా ఉందా అని వసతులు కల్పించని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Full View