కామంతో కల్లు మూసుకుపోయిన బావ.. భార్య చెల్లిపై కన్నేశాడు. అంతటితో ఆగకుండా ఆమె కావాలని పట్టుబట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె చెల్లిని బలవంతంగా పెళ్లి చేసుకొని భార్య సహా తన నలుగురు పిల్లలను ఇంట్లో నుంచి గెంటేశాడు. చెల్లిని కాపురానికి పంపిస్తేనే ఇంట్లోకి అనుమతిస్తానని తెగేసి చెప్పాడు. భర్త మాటలు నమ్మి చెల్లిని తీసుకువచ్చిన భార్యకు మరో షాక్ తగిలింది.. నిజామాబాద్‌లోని విద్యుత్ నగర్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన సంచలనమైంది.
అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ కాదని ఈ ప్రబుద్దుడు మరో మహిళను వివాహం చేసుకొని వేరు కాపురం పెట్టి మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన భార్య, ఆమె చెల్లి తాజాగా నలుగురు పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలంటూ అతడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఆమె చేస్తున్న నిరసనకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. రచ్చ రచ్చ చేశాయి.
విద్యుత్ నగర్ కు చెందిన గల్ఫ్ ఏజెంట్ కృష్ణకు 15 ఏళ్ల క్రితం హారికతో వివాహమైంది. కాగా నలుగురు పిల్లలు పుట్టాక హారిక చెల్లలిపై కన్ను పడింది. ఆమెను బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మరో వైపు తన చెల్లిని కాపురానికి పంపిస్తేనే ఇంట్లోకి రానిస్తానని భార్యకు షరతు పెట్టాడు. ఇంట్లోంచి హారికను గెంటేశాడు. అనంతరం వేరే మహిళను చేసుకొని ఆమెతో ఉంటున్నాడు.
దీంతో హారిక, ఆమె చెల్లి కూడా కృష్ణ ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి ఈ భార్యలను మార్చే భర్తను విచారిస్తున్నారు.