ఇటీవల కాలంలో మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. బంధాలకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతోంది. కట్టుకున్న వారిలో కలకాలం కష్టసుఖాల్లో తోడు ఉండాల్సిన వారు పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి దారుణంగా మోసపోతున్నారు.ఇవి సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.
ముఖ్యంగా ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా ఎంతో మంది పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. కొంతమంది మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటే.. ఇంకొన్ని చోట్ల కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
వివాహేతర సంబంధాలకు సంబంధించి రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది.
ఒడిశాలోని కలహండి జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. పెళ్లై పిల్లలు ఉన్న వ్యక్తి ఏకంగా హిజ్రాతో ప్రేమలో పడ్డ వైనం విస్తుగొలుపుతోంది. చివరకు భార్యకు తెలియకుండా హిజ్రాతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడింది. హిజ్రాతో తన భర్త ప్రేమలో ఉన్నాడన్న విషయం భార్యకు తెలిసింది. ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఫకీర్ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహం జరగగా.. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఏడాది క్రితం గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో ప్రేమలో మునిగి తేలుతూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఈవిషయం తెలిసిన అతడి భార్య హిజ్రాతో మాట్లాడి తన భర్తతో సాంప్రదాయబద్దంగా గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేయించింది.
తాను ఫకీరును ప్రేమించానని.. ఇక అతడి భార్య అర్థం చేసుకొని నాకు కొత్త జీవితం ప్రసాదించింది అంటూ హిజ్రా సంతోషం వ్యక్తం చేసింది. భర్త సుఖం కోసం ఏకంగా హిజ్రాతో పెళ్లి చేసిన భార్య వైనం చర్చనీయాంశమైంది. ఆమె త్యాగశీలతపై అందరూ తలోరకమైన ప్రతిస్పందన వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.