ఆన్ లైన్ లో నగ్న వీడియోలు పెట్టిన భర్త.. భార్య ఆత్మహత్య

Update: 2021-08-30 13:30 GMT
త్రిబుల్ తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె పుట్టింటికి చేరింది. భర్తపై కేసు పెట్టింది. అయితే తనపైనే కేసు పెడుతావా? అని కోపం పెంచుకున్న భర్త.. తాము కలిసి ఉన్నప్పుడు భార్యను నగ్నంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

దంపతులకు నాలుగేళ్ల కిందట వివాహమైంది. ఏడాదిన్నర బాబు ఉన్నాడు. మూడు నెలల కిందట నిందితుడు ట్రిపుల్ తలాక్ చెప్పేశారు.  భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె తన కుమారుడిని తీసుకొని కిషన్ పూర్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆగస్టు 18న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తలాక్ ద్వారా విడాకులిచ్చిన భర్త.. బలవంతంగా తన కుమారుడిని తీసుకెళ్లిపోయాడని మహిళ ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భార్య నగ్న వీడియో ఒకటి సోసల్ మీడియాలో దర్శనమిచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసిందనే అక్కసుతోనే భర్త  ఏకంగా భార్య నగ్న వీడియోను పోస్ట్ చేశాడని తేలింది.

దీంతో తీవ్ర ఆవేదన చెందిన భార్య ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News