భార్యను అమ్మకానికి పెట్టేశాడో ప్రబుద్ధుడు. పేదరికంతోనో.. మరో కారణంతోనే మన దగ్గరా ఇలాంటి దరిద్రాలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ప్రాశ్చాత్య దేశంలో ఇలాంటి వైనం కాస్త వెరైటీగా కనిపిస్తుంది. ఈబేలో తన భార్యను అమ్మకానికి పెట్టినట్లుగా ఒక వ్యక్తి చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్యోన్యంగా ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన సదరు వ్యక్తి.. తన భార్యలోని ‘కోణాల్ని’ చెప్పుకొచ్చాడు. తన భార్యను సొంతం చేసుకున్నోడు అదృష్టవంతుడిగా పేర్కొన్న ఇతగాడి యవ్వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
జోకెర్ సిమన్ ఓకనె అనే వ్యక్తి తన భార్య లీండ్రాను ఈబేలో అమ్మకానికి పెట్టేశాడు. లీండ్రాకు దైవభక్తి అన్నది అస్సలు లేదని.. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏ మాత్రం పూజలు చేయలేదని చెప్పుకొచ్చాడు. 33 ఏళ్ల సిమన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భార్య తన చేతలతో.. మాటలతో హింసిస్తోందని.. అందుకే ఆమెను అమ్మేయాలని తాను అనుకున్నట్లుగా వెల్లడించాడు. తన భార్య (లీండ్రా) బాగా నవ్వుతుందని.. లొడలొడా మాట్లాడుతుంటుందని చెప్పారు. మంచి బాడీ వర్క్.. చక్కటి షేప్ ఆమె సొంతమన్న అతడు.. తన భార్య వంటపని అద్భుతంగా చేస్తుందని వెల్లడించాడు.
ఫర్ సేల్ వన్ వైఫ్ అంటూ తన సేల్ గురించి చెప్పిన అతడు.. తన భార్యను దక్కించుకున్నోడు లక్కీగా అభివర్ణించాడు. ఒక్కసారి అమ్మిన వస్తువు రిటన్ తీసుకోరన్నట్లుగా తన భార్యను తిరిగి వెనక్కి తీసుకోవటం సాధ్యం కాదని వెల్లడించాడు. భార్యను అమ్మకానికి పెట్టి బిడ్ కు అనూహ్య స్పందన లభించటం గమనార్హం కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 65,880 పౌండ్ల బిడ్లు వచ్చాయి. తన భర్త చేసిన ఘనకార్యం గురించి తెలిసిన లీండ్రా మండిపడుతోంది. ఎప్పుడూ నవ్వుతుందని చెప్పిన సిమన్ మాటకు విరుద్ధంగా ఇప్పుడామె ముఖంలో నవ్వు అన్నది ఉండకపోవచ్చేమో..?