మననుషులకు ఏమైపోతోంది? ఓపక్క ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవటానికి సైతం వెనుకాడని వారు ఒకవైపు.. మరోవైపు కలిసి కాపురం చేస్తామని వివాహంతో ఒక్కటైన వారు.. కాలక్రమంలో విభేదాలతో ప్రాణాలు తీసుకుంటున్నా పట్టనట్లుగా వ్యవహరించే తీరు చూస్తే షాకింగ్ గా అనిపించక మానదు. తాజాగా ఒక ఉదంతం చూస్తే.. మనిషి మనసు ఇంత పాషాణంగా ఎందుకు మారుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గొడవలు ఎన్నైనా ఉండొచ్చు.. ఆగ్రహంతో ఆత్మహత్య చేసుకోబోతున్న భార్యను మందలించాలే కానీ.. ఆత్మహత్య చేసుకో.. బెదిరిస్తావా? అంటూ చనిపోయేందుకు సిద్ధమై.. చనిపోతున్నా.. వీడియో తీసే వైనాన్ని ఏమనాలి?
ఈ పైశాచిక వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇందుకు నెల్లూరు జిల్లా వేదికైంది. జిల్లాలోని ఆత్మకూరులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో భర్ తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండమ్మను ఆత్మకూరు పట్టణానికి చెందిన పెంచలయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. అతను బ్యాంక్ ఏటీఎం వద్ద సెక్యురిటీ గార్డుగా పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు. రెండో కొడుక్కి పదేళ్లు. అతడు గుండెజబ్బుతో బాధ పడుతున్నాడు.
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. నిత్యం ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా వారిద్దరూ గొడవపడ్డారు. ఈ సందర్భంగా ఆగ్రహంతో పెంచలయ్య.. నువ్వు చస్తేనే సమస్యలు తీరతాయన్న మాటకు వేదనకు గురైన కొండమ్మ విరక్తితో ఊరేసుకునేందుకు సిద్ధమైంది. ఫ్యాన్ కు చీర తగిలించి ఉరేసుకుంటుండగా.. సెల్ ఫోన్ లో వీడియో తీస్తూ.. ఉరేసుకో.. నేను ఆపను అంటూ ఆమె ఉరిని లైవ్ గా షూట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు.
ఉరి బాగా బిగుసుకుపోవటంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ వెంటనే అక్కడి నుంచి పరారీ అయ్యాడు. దీన్ని గమనించిన స్థానికులు కొండమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ రాత్రి పదకొండు గంటల వేళలో చనిపోయింది. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం.. తండ్రి తోడు లేకపోవటంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారి.. ఆసుపత్రి వద్ద దిగాలుగా కూర్చున్న వైనం ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టేలా మారింది.
భార్య ఆత్మహత్య చేసుకుంటున్న వైనాన్ని షూట్ చేయటమే కాదు.. అందులో తన తప్పేమీ లేదన్నట్లుగా తమ బంధువులకు అతడు పంపిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ కసాయిని అదుపులోకి తీసుకున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది.
కానీ.. ఈ వీడియోను మేం మీకు షేర్ చేయకూడదని భావిస్తున్నాం. అనవసరమైన ఉద్వేగంతో పాటు.. మానసిక కలకలాన్ని పెంచేలా ఉన్న ఈ వీడియోతో అనవసరమైన ఆందోళన.. నెగిటివిటీ పెంచటం ఇష్టం లేదు. సామాజిక బాధ్యతగా భావించి.. ఈ వీడియోను చూడకుండా ఉంచటమే మంచిదన్న భావనతో దీన్ని షేర్ చేయట్లేదు. ఈ వార్తను ఇవ్వటానికి కారణం.. మనుషుల మనసులు ఉండే కొద్దీ ఎలా మారుతున్నాయన్న దానికి నిదర్శనంగా నిలిచే ఉదంతం తెలియజేయటం మా ధర్మంగా భావిస్తున్నాం.