యూపీ బీజేపీ మహిళా నేతను దారుణంగా చంపేసిన భర్త

Update: 2022-04-30 05:05 GMT
యూపీలో యోగి సర్కారు కొలువు తీరిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని.. తప్పు చేసే వారంతా భయపడిపోతున్నారని.. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి.. క్రైంను కంట్రోల్ చేయటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాతే ఎవరైనా అన్న ప్రచారం జోరుగా సాగే సంగతి తెలిసిందే. దారుణ నేరాలు చేయాలన్న ఆలోచనే నేరస్తులకు తడిచిపోయేలా యోగి సర్కారు పని తీరు ఉందన్న మాటలో ఏ మాత్రం నిజం లేదన్నట్లుగా ఒక దారుణ ఉదంతం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన తర్వాత యోగి సర్కారు సమర్థత మీద కొత్త సందేహాలు వచ్చే పరిస్థితి.

యూపీకి చెందిన బీజేపీ నేత.. జిల్లా పంచాయితీ సభ్యురాలు 35 ఏళ్ల శ్వేత సింగ్ గౌర్. అనుమానాస్పద రీతిలో ఆమె మరణించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె తన ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తున్న వైనం కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమె భర్త (ఇతను కూడా బీజేపీ నేతనే.. కాకుంటే లిక్కర్ వ్యాపారి) కనిపించకుండాపోయాడు. ఆత్మహత్య చేసుకున్న గదిలో ఎలాంటి సూసైడ్ లెటర్ లభించలేదు.

శ్వేత సింగ్ గౌర్ కు ఇద్దరు కుమార్తెలు. ఆమె ఉరి వేసుకున్న సమయంలో వారిద్దరు స్కూల్ లో ఉన్నారు. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి..బలవన్మరణం ద్వారా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన తల్లిని చూసి వారు భోరున విలపించారు. ఈ వేదనలోనే వారో షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. తాము స్కూల్ కు వెళ్లే వేళ.. తమ తండ్రి తమతో 'స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి మీ అమ్మ చచ్చిపోయి ఉంటుంది"అని చెప్పారని.. ఇప్పుడు అదే జరిగిందని వాపోయారు.

తమ తండ్రికి కొడుకు కావాలని.. కానీ తాము ఇద్దరం ఆడపిల్లలు పుట్టటంతో.. ఆ విషయం మీద తల్లిని తీవ్రంగా హింసించేవాడని పేర్కొన్నారు. వ్యాపారి కూడా కావడం గమనార్హం. శ్వేతా సింగ్ గౌర్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ చేస్తున్న పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. శ్వేతకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారు చెప్పిన విషయం కేసులో కీలకంగా మారింది. కొడుకు పుట్టలేదన్న కారణంగా తల్లిని తమ తండ్రి చిత్రహింసలకు గురి చేసేవారంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.

తాజా ఉదంతంలో తమ తండ్రిదే తప్పన్నట్లుగా కుమార్తెలు పేర్కొంటున్నారు. తమకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. అయితే.. ఈ దారుణ హత్య (పోలీసుల లెక్కలో అనుమానాస్పద మరణం) జరిగి 24 గంటలు అవుతున్నా.. అనుమానితుడైన శ్వేత సింగ్ గౌర్ భర్తను పట్టుకోవటంలో పోలీసులు ఫెయిల్ అయ్యారు.

నేరం జరిగినంతనే జేసీబీ బయటకు రావటం.. నేరస్తుల వెన్నులో చలి పుట్టిస్తారనే యోగి సర్కారు.. సొంత పార్టీకి చెందిన మహిళా నేత దారుణంగా హత్యకు గురైనప్పుడు వాయు వేగంతో స్పందించాలి కదా? అలా ఎందుకు జరగట్లేదు?
Tags:    

Similar News