తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా కొత్తవేడిని పుట్టిస్తోంది హుజూర్ నగర్ ఉప ఎన్నిక. దీనికి సంబంధించి ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరన్న విషయం మీద పూర్తి క్లారిటీ వచ్చేసింది. ప్రధాన రాజకీయ పక్షాలన్ని తమ అభ్యర్థుల్ని బరిలోకి దించుతున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయని తెలుగుదేశం పార్టీ కూడా తాజా ఎన్నికల్లో పోటీ చేస్తోంది.
ఉప ఎన్నికలో ప్రదాన పోటీ టీఆర్ ఎస్.. కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. ఇదిలా ఉంటే.. టీఆర్ ఎస్ నేతలు పలువురు సీపీఐ కార్యాలయానికి వెళ్లి.. వారిని మద్దతు కోరటం.. అందుకు ప్రాధమికంగా కాసింత సానుకూలంగా స్పందించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బరిలో దిగిన వివిధ పార్టీల అభ్యర్థుల విషయానికి వస్తే.. టీఆర్ ఎస్ తరఫున సైది రెడ్డి.. కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి బరిలో ఉండగా.. బీజేపీ నుంచి డాక్టర్ కోట రామారావు.. సీపీఎం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి పారేపల్లి శేఖర్ రావు బరిలో నిలిచారు. టీటీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయిలను ఎంపిక చేశారు. వీరంతా ఈ రోజు (సోమవారం) నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
తాజాగా సీపీఐ పార్టీ కార్యాలయానికి టీఆర్ ఎస్ నేతలు వెళ్లటం.. తమకు మద్దతు ఇవ్వాలని ప్రకటించటంతో ఆ పార్టీ బరిలోకి దిగే అవకాశం లేనట్లే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు వీలుగా వివిధ సంఘాల వారు ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల సాధన కోసం సర్పంచ్ ల సంఘం నుంచి భారీగా నామినేషన్లు వేయాలని నిర్ణయించారు.
ఇదిలా ఉంటే.. సర్పంచ్ ల సంఘం గౌరవాధ్యక్షుడు భూమన్నను అరెస్ట్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పెద్ద ఎత్తున సర్పంచ్ లు నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సర్పంచ్ లు ఎంత భారీగా నామినేషన్లు వేస్తారన్న దానిపై లెక్కలు తేలటం లేదు. ఈ అంశంపై ఈ రోజు (సోమవారం) స్పష్టత రానుంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావటంతో.. నామినేషన్లు వేయాల్సిన వారంతా ఇవాళే వేసే వీలుంది. ఇప్పుడున్న అంచనా ప్రకారం సర్పంచ్ లు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే వీలుంది.