ఆ రెండు చోట్ల ముంద‌స్తు దీపావ‌ళి.. ముగిసింది... మైకులు బంద్‌!!

Update: 2021-10-27 11:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ ఉప ఎన్నిక‌ల ప్ర‌చార వేడి చ‌ల్లారు తోంది. తెలంగాణ‌ లోని హుజూరాబాద్‌, ఏపీ లో ని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజ‌క‌ వ‌ర్గాల‌కు ఈనెల 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మం లోనే ఎన్నిక‌ కు ఒక రోజు ముందు గానే ప్ర‌చార ప‌ర్వానికి తెర‌ ప‌డనుంది. ఈ రెండు ఎన్నిక‌ల్లో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ పై భారీ ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి. అంతే కాదు.. అన్ని వ‌ర్గాలు.. కూడా దీని వైపు చూస్తున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్ గెలుస్తాడా?  లేక అధికార పార్టీ నాయ‌కుడు గెల్లు శ్రీను గెలుపు గుర్రం ఎక్కుతాడా? అని తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.

ఇక‌, ప్ర‌చార ప‌ర్వం చూసుకుంటే.. అటు బ‌ద్వేల్‌.. ఇటు హుజూరాబాద్‌.. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ భారీ ఎత్తున అధికార‌.. ప్ర‌తిప‌క్షాల శ్రేణులు మోహ‌రించి.. ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇది బుధ‌వారం సాయం త్రంతో ముగిసింది. మ‌రొక్క రోజులో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో ఇక‌, పంప‌కాలే మిగిలాయ‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి కే బీజేపీ రూ.6 వేల చొప్పున ఇంటింటి కీ పంచింద‌ని.. హుజూరాబాద్‌ లో కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి డీ. శ్రీధ‌ర్ బాబు చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యం లో అధికార పార్టీ కూడా పంప‌కాలు షురూ చేసింద‌ని బీజేపీ నేత‌లు ఆరోపించారు.

ఇక‌, ఇటు బ‌ద్వేల్‌ లోనూ.. అధికార పార్టీ ప్ర‌ లోభాల‌కు గురి చేస్తోంద‌ని.. బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ కి ఓటేయ‌క‌పోతే.. పింఛ‌న్లు ఆపేస్తామంటూ.. వాలంటీర్ల‌ తో బెదిరింపుల‌ కు గురి చేస్తున్నార‌ని.. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు.. పురందేశ్వి అన్నారు. ఏకం గా కేంద్ర బ‌ల‌గాలు మోహ‌రించాల‌ని..  రాష్ట్ర బీజేపీ సార‌థి సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. మ‌రో వైపు.. ప‌థ‌కాలు కావాలన్నా.. మీకు అభివృద్ధి కావాల‌న్నా.. కారు గుర్తు కే ఓటేయా లంటూ.. హ‌రీష్ రావు.. హుజూరాబాద్‌ లో దుమ్మురేపారు. గెల్లు శ్రీను తో క‌లిసి.. చివ‌రి రోజు భారీ ఎత్తున ఆయ‌న స‌భ‌లు నిర్వ‌హించారు.

ఇక‌, ఇప్పుడు ప్ర‌జ‌లు త‌మ స‌త్తా చూపే స‌మ‌యం వ‌చ్చేసింది. శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు అటు బ‌ద్వేల్‌, ఇటు హుజూరాబాద్‌ లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. ఇక‌... ఇప్ప‌టి కే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఫ‌లితం పై కొన్ని సంస్థ‌లు స‌ర్వేలు చేసిన‌ట్టు తెలుస్తోంది. అధికార పార్టీ వైపే .. ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌ని.. చెబుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా హుజూరాబాద్ లోనే ట‌ఫ్  ఫైట్ ఉంటుంద‌ని.. ఇక్క‌డ ఓట్లు వేసే వారి మెజారిటీ పెరిగితేనే.. ఈట‌ల‌ కు ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తానికి 20 రోజుల‌కు పై గానే నోత‌ల నోట మాట‌ల తూటాల‌ తో ముంద‌స్తు.. దీపావ‌ళి చేసుకున్న ఈ రెండు నియోజ‌క‌ వ‌ర్గాల్లోనూ మైకులు మూగ‌బోయాయి. ఇక‌, ఓట‌ర‌న్న చేతిలో ఫ‌లితం ఆధార‌ప‌డింది.
Tags:    

Similar News