ఈ మధ్యనే ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితానికి సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. ఈటల విజయంతో టీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేగగా.. జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయటానికి గులాబీ బాస్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే రావటం ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం.. ఆరోపణలు సంధించుకోవటం తెలిసిందే.
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల విజయంలో కొందరు కాంగ్రెస్ నేతలు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లుగా ఆరోపణలు రావటం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ ను టార్గెట్ చేసేలా కొందరు ప్రయత్నాలు చేయటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఈ ఓటమిపై సమీక్షను ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్వహించారు. ఈ సమావేశం ఆద్యంతం వాడివేడిగా జరగటంతో పాటు.. పలుమార్లు నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాల్ని వెల్లడించాలని కోరారు. దీంతో తొలుత రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా భాద్యతల్ని స్వీకరించానని.. ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా సీనియర్ నేతలతో కమిటీని నియమించినట్లుగా వెల్లడించారు. కమిటీ చేసిన ప్రతిపాదనల ప్రకారమే అన్ని నిర్ణయాల్్ని తీసుకున్నామని చెబుతూ.. ముఖ్యనేతలందరికి ఎన్నికల్లో ఏయే బాద్యతల్ని అప్పగించింది వివరంచారు.
ఇదిలా ఉంటే.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వేళలో.. తన సోదరుడైన కౌశిక్ రెడ్డికి స్థానికంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. చివరి నిమిషంలో ఆయన పార్టీని విడిచిపెట్టి వెళ్లినట్లుగా పొన్నం పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఉత్తమ్.. కౌశిక్ రెడ్డి పార్టీని వీడిపోవటం.. టీఆర్ఎస్ చేరటంలో తనకు సంబంధం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా నేతల మధ్య వాడీవేడిగా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు.. సభలకు జనాలు బాగా వస్తున్నారు కదా? ఉప ఎన్నికల్లో మూడు వేల ఓట్లు మాత్రమే ఎందుకు వచ్చినట్లు? అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలకు భారీగా వస్తున్న జనాల ఫోటోల్ని కేసీ వేణుగోపాల్ షేర్ చేయగా.. అవునన్న రేవంత్ రెడ్డి.. ఓట్లు తక్కువగా రావటానికి కారణాన్ని వివరించినట్లుగా సమాచారం.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినవని.. కేసీఆర్ వర్సెస్ ఈటల అన్నట్లు సాగాయని.. అదే రీతిలో ప్రచారం జరిగినట్లుగా రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ ను ఓడించాలన్న కసి.. కోపంతో ఉప ఎన్నిక జరిగినట్లుగా చెప్పారు. సభలకు వచ్చే జనాలకు.. ఉప ఎన్నిక ఫలితానికి సంబంధం లేదన్న రేవంత్.. సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు.. జీవన్ రెడ్డి తదితర నేతలు ఎక్కడెక్కడ ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టింది.. ఆయా ప్రాంతాల్లో వచ్చిన ఓట్ల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీలోకి ఈటలను తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం రాగా.. అందుకు స్పందించిన భట్టి విక్రమార్క.. కొందరు నేతలు ఈటలను రాకుండా అడ్డుకున్నారన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన కేసీ వేణుగోపాల్.. ఈటల పార్టీలో చేరతానంటే మీరే వద్దన్నారు కదా? మళ్లీ ఇప్పుడు వస్తే బాగుండని ఇతరులపై నిందలు వేయటం సరికాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ సందర్భంగా ఉత్తమ్ పరిస్థితిని బ్యాలెన్సు చేసేలా మాట్లాడినట్లుగా చెబుతున్నారు.
ఈటల.. భట్టి మధ్య భేటీ జరగటం.. అది కాస్తా బయటకు రావటంతో బీజేపీ కేంద్ర నాయకత్వం అప్రమత్తమై.. వారి పార్టీలోకి లాగుకుందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఉదయం జరిగిన సమావేశం మొత్తం హాట్ హాట్ గా సాగటం.. అనంతరం నేతలు ఎవరికి వారు విడివిడిగా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తామని చెప్పటంతో అందుకు తగ్గట్లు సాయంత్రం ఎవరికి వారు విడివిడిగా తమ అభిప్రాయాల్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది.